Shilpa Chowdary Case: చీటింగ్ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. ఇంతలో మరో ట్విస్ట్.. 

Shilpa Chowdary Cheating Case: కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి.. కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు

Shilpa Chowdary Case: చీటింగ్ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. ఇంతలో మరో ట్విస్ట్.. 
Shilpa Chowdary
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 16, 2021 | 5:51 PM

Shilpa Chowdary Cheating Case: కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి.. కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు అయింది. ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పెటుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే.. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్‌ మంజూరైంది. మరో రెండు కేసుల్లో బెయిల్‌ లభించలేదు. దీంతోపాటు ఆమె జైలులోనే ఉండనుంది.

కాగా.. విచారణలో భాగంగా పోలీసులు శిల్పా చౌదరి బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాకు సంబంధించిన వివరాలను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేయగా.. లాకర్‌లో ఏమీ లభించలేదు. దీంతో శిల్పా ఆ డబ్బును ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆమె పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే.. ఎలాంటి ఆధారాలు లభించకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటా, పలు బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also Read:

Etela Rajender: పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

Uttarakhand Elections 2022: దేశం కోసం మా కుటుంబం కూడా త్యాగం చేసింది.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!