SBI Call Center: ఎస్బీఐ’కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! ఇంతటి ఘరానా మోసం.. (వీడియో)
ఎస్బీఐ బ్యాంక్ పేరుతో నకిలీ కాల్ సెంటర్ ముఠా దందా సాగిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పాల్పడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. కార్పొరేట్ తరహాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని స్ఫూఫింగ్‌లో రాటుదేలిపోయిన సిబ్బందిని నియమించుకుని ..
ఎస్బీఐ బ్యాంక్ పేరుతో నకిలీ కాల్ సెంటర్ ముఠా దందా సాగిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పాల్పడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. కార్పొరేట్ తరహాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని స్ఫూఫింగ్‌లో రాటుదేలిపోయిన సిబ్బందిని నియమించుకుని .. ట్రైనింగ్ ఇచ్చి మరీ మోసాలు చేస్తున్నట్లుగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.మీరు ఎస్‌బీఐ కస్టమర్లు అయితే… ఎస్‌బీఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో ఎప్పుడో ఓ సారి కాల్ అందుకునే ఉంటారు. ఆ కాల్ కూడా ఎస్‌బీఐ కాల్ సెంటర్ నెంబర్ దే అయి ఉంటుంది. 1860 180 1290 నెంబర్ నుంచి కాల్ వస్తున్నట్లుగా చూపించేలా స్ఫూపింగ్ యాప్ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. ఈ కాల్ సెంటర్ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాల్ సెంటర్ నుండి దేశవ్యాప్తంగా సుమారు 33 వేల కాల్స్ చేశారని, ఆయా రాష్ట్రాల్లో 5 వేల పైన కేసులు ఉండవచ్చని సీపీ తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక కారు, 15 బైక్ లు, 30 మొబైల్స్, లాప్ టాప్ లు సీజ్ చేశారు.