Uttarakhand Elections 2022: దేశం కోసం మా కుటుంబం కూడా త్యాగం చేసింది.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్..
ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. రాష్ట్రంలోని అనేక కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసిందని అన్నారు. ఈ సందర్బంగా..
ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. రాష్ట్రంలోని అనేక కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసిందని అన్నారు. ఈ సందర్బంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ సభలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరగాంధీకి 32 బుల్లెట్లు తగిలాయని, కాని బంగ్లా విముక్తిని విజయ్ దివస్‌గా నిర్వహించిన కేంద్రం కనీసం ఆమెకు నివాళి అర్పించలేదని మండిపడ్డారు. ఈ సందర్బంగా రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సభకు భారీ సంఖ్యలో మాజీ సైనికులు కూడా హాజరయ్యారు.
ఢిల్లీ శివార్లలో రైతులు చనిపోయినట్టు తమ దగ్గర ఎలాంటి జాబితా లేదని కేంద్రం పార్లమెంట్‌లో రాహుల్ చెప్పిందన్నారు. ఒక్క పంజాబ్‌లోనే 400 మంది రైతులు చనిపోయారని ఆ జాబితాను కేంద్రానికి ఇచ్చినట్టు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పరిహారం ఇచ్చిందని.. కాని కేంద్రం మాత్రం రైతులకు పరిహారం ఇవ్వడానికి రెడీగా లేదన్నారు.
అయితే డెహ్రాడూన్ ర్యాలీలో దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ కటౌట్‌ను పెట్టడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాదు అమరవీరుల మధ్య రాహుల్ ఫోటోను పెట్టడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం సైనికుల ఫోటోలు పెట్టవద్దని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..
Pushpa: బొమ్మ అదుర్స్ అంతే.. యూఏఈ నుంచి పుష్ప మొదటి రివ్యూ..