Etela Rajender: పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
Etela Rajender on CM KCR: తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. ఇటీవల తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్న ఈటల..
Etela Rajender on CM KCR: తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. ఇటీవల తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్న ఈటల.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే సీఎం కే చంద్రశేఖర్ రావుపై పోటీకి సిద్ధమని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నుంచే పోటీ చేస్తానని.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్దమమని పేర్కొన్నారు. బీజేపీలో విభేదాలు లేవని.. అందరం కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. బీజేపీలో మనస్ఫూర్తిగానే కొనసాగుతున్నానని ఈటల స్పష్టంచేశారు. టీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేదు అనుకునే నేతలు చాలామంది ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అడ్డుకున్నప్పుడే తన ఆత్మగౌరవం దెబ్బతిందంటూ ఈటల పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో మంత్రివర్గ భేటీకి ముందే నిర్ణయాలు తీసుకునేవారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడే.. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు ఎందుకంటూ ప్రశ్నించానని ఈటల గుర్తుచేశారు.
రైతుబంధు డబ్బులు కేసీఆర్ ఇంట్లోనివి కావని తెలంగాణ ప్రజల చెమట నుంచి వచ్చిన డబ్బులని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్.. నాకూ రైతుబంధు ఇవ్వడం సమంజసమా అంటూ ఆయన ప్రశ్నించారు. రైతు కూలీలు, కౌలు దారులను కేసీఆర్ విస్మరించారన్నారు. తెలంగాణ బిడ్డల రక్తం కళ్ల చూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారంటూ విమర్శించారు. హుజూరాబాద్‌లో రూ.600కోట్ల నల్లధనం ఖర్చు చేశారు.. అంత డబ్బు కేసీఆర్‌కు ఎలా వచ్చిందంటూ ఈటల ప్రశ్నించారు. దళితులపై ప్రేమతో దళితబంధు తీసుకురాలేదని.. ఓట్ల కోసమే ఆ పథకం తీసుకొచ్చారంటూ ఈటల విమర్శించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ ప్రజల తీర్పుతోనే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకొచ్చారంటూ పేర్కొన్నారు.
Also Read: