Education: ఆ కళాశాలలపై కఠిన చర్యలు.. అదనపు ఫీజుల దోపిడీపై ఇంటర్ బోర్డు ఆగ్రహం..
ఇంటర్ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు కాకుండా ఇతరత్రా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులుచేస్తే కఠిన చర్యలు
ఇంటర్ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు కాకుండా ఇతరత్రా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇటీవల కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజుతో పాటు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. ఇంటర్ బోర్డు దాకా ఈ విషయం చేరింది. దీంతో స్పందించిన అధికారులు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది.
గుర్తింపు రద్దు చేస్తాం.. ‘ కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు కాకుండా ఇతరత్రా ఫీజులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలా ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులొస్తే సంబంధిత కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంటర్ బోర్డు నిబంధలనకు అనుగుణంగానే ఫీజులు ఉండాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లు తెలిస్తే కాలేజీ గుర్తింపు రద్దుచేస్తాం’ అని తాజాగా జారీ చేసిన ప్రకటనలో ఇంటర్ బోర్డు హెచ్చరించింది.
TS Inter 1st Year Result 2021: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చూసుకోండి..
BEL Recruitment: బెల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..