Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?

Vizianagaram Shocking News: భర్త అంటే.. ఆ భార్య అస్సలు ఇష్టం లేదు. దీంతో కుంటుంబంలో నిత్య గొడవలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భార్య ప్లాన్ వేసి భర్తపై దారుణానికి ఒడిగట్టింది. ఇష్టంలేని

Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 16, 2021 | 8:16 PM

Vizianagaram Shocking News: భర్త అంటే.. ఆ భార్య అస్సలు ఇష్టం లేదు. దీంతో కుంటుంబంలో నిత్య గొడవలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భార్య ప్లాన్ వేసి భర్తపై దారుణానికి ఒడిగట్టింది. ఇష్టంలేని మొగుడితో కాపురం ఎన్నాళ్ళు చేయాలా అంటూ.. సలసలా కాగే వేడి నూనెని మొగుడి మర్మాంగాలపై పోసింది. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ కోట మండలం వెంకటరమణపేట గ్రామానికి చెందిన గంగునాయుడు, సత్యవతికి నాలుగేళ్ళ క్రితం 2017లో వివాహం జరిగింది. సత్యవతి సొంత ఊరు వేపాడ మండలం జాకేరు గ్రామం. గంగునాయుడిని వివాహమాడటం సత్యవతికి ఇష్టం లేకపోయినా పెద్దల బలవంతం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి అయితే జరిగింది కానీ వారి మధ్య సఖ్యత ఏ రోజూ లేదు. కలహాల కాపురంతోనే నాలుగేళ్లు గడిచాయి. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. వీరి గొడవలు చూసిన చుట్టుపక్కల వారు ఇద్దరికి సర్దిచెబుతూ ఉండేవారు. గంగునాయుడు ఆటోడ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆటో పని ముగించుకొని రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.

భర్త ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రలో ఉంది. భర్త వచ్చిరాగానే భార్యను నిద్రలేపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎప్పటిలాగే మాటా మాటా పెరిగింది. గొడవకు దారి తీసింది. తరువాత కొద్దిసేపటికి గొడవ సద్దుమణిగి ఎవరంతట వారు నిద్రపోయారు. కానీ భార్య సత్యవతికి మాత్రం భర్తపై కోపం తీవ్రంగా పెరిగింది. ఎలాగైనా భర్తపై కసి తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అర్ధరాత్రి నిద్ర లేచి ఇంట్లో ఉన్న వంటనూనెను బాగా మరగబెట్టింది. సలసలా మరిగిన తరువాత వేడి నూనెను నిద్రిస్తున్న భర్త మర్మాంగాలపై పోసింది. దీంతో సడెన్‌గా గంగునాయుడు.. నిద్ర లేచి పెద్దగా కేకలు వేశాడు. అతని వంటి నిండా వేడి నూనె పడి ఉంది.

గుంగునాయుడు కేకలు విన్న స్థానికులు పరిగెత్తుకొని వచ్చి అక్కడే ఉన్న భార్యను వారించి భర్తను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గంగునాయుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం భార్య సత్యవతిని పోలీసులు అదుపులోకి రిమాండ్‌కు పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం కానీ అవి కొంతవరకే ఉండాలి. ఇలా శ్రుతి మించి దారుణలకు ఒడిగట్టేవరకు రాకూడదని.. భార్యా భర్తల మధ్య సంఖ్యత ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు.

కోటేశ్వరరావు, టీవీ9 తెలుగు రిపోర్టర్, విజయనగరం

Also Read:

Shilpa Chowdary Case: చీటింగ్ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. ఇంతలో మరో ట్విస్ట్.. 

Prashant Kishore: రూటు మార్చిన ప్రశాంత్ కిశోర్.. ఆయనే భావి దేశ ప్రధాని అంటూ..