AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishore: రూటు మార్చిన ప్రశాంత్ కిశోర్.. ఆయనే భావి దేశ ప్రధాని అంటూ..

Prashant Kishore on Rahul Gandhi: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే.. తాజాగా మాటమార్చారు. రాహుల్ నాయకత్వం

Prashant Kishore: రూటు మార్చిన ప్రశాంత్ కిశోర్.. ఆయనే భావి దేశ ప్రధాని అంటూ..
Prashant Kishore
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:13 PM

Share

Prashant Kishore on Rahul Gandhi: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలనే రాహుల్ గాంధీపై పలు విమర్శలు చేసిన పీకే.. తాజాగా మాటమార్చారు. రాహుల్ నాయకత్వం సరిగా లేదని.. ప్రధాని ఎప్పటికీ కాలేరంటూ పేర్కొన్న ప్రశాంత్ కిశోర్.. తాజాగా మరోసారి స్వరాన్ని సవరించుకున్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు.. త‌న పాత బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ విష‌యంలో కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తాజాగా ఓ జాతీయ ఛాన‌ల్ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ గురించి ప్రశ్నించగా.. కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ఓ విప‌క్ష కూట‌మి ఏర్పాటు చేయడం.. మ‌న‌గ‌ల‌గ‌డం దాదాపు త‌క్కువేనంటూ తేల్చి చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ లేకున్నా.. కేంద్రంలో విప‌క్ష కూట‌మి సాధ్యమేనంటూ పీకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రతిపక్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే కేవలం పార్టీలను కూడగట్టుకోవడం ద్వారా బీజేపీని గెలుపును నియంత్రించలేమని పేర్కొన్నారు. మోదీని ఓడించేందుకు గట్టి సందేశం, నాయకత్వం కావాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతే కాకుండా హిందుత్వ అంశం అనవసరమని.. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ప్రకటన వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందన్నారు.

అయితే.. సీఎం నితీశ్‌కుమార్, జేడీయూతో పీకే తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంటర్వ్యూలో మళ్లీ ఎవ‌రితో క‌లిసి ప‌నిచేయాల‌ని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించగా.. బీహార్ సీఎం నితీశ్‌తో అని పీకే పేర్కొన్నారు. ఇప్పటికీ నితీశ్‌తో మాట్లాడ‌తారా అని ప్రశ్నించగా.. మాట్లాడుకుంటామని సమాధానమిచ్చారు. అయితే పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌తో పనిచేస్తారా.. అని ప్రశ్నించగా.. నచ్చదని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కూడా కాంగ్రెస్ మ‌నుగ‌డ సాధిస్తుందంటూ పీకే పేర్కొన్నారు. 2017 కంటే.. యూపీలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ నాయకుడు ఎవరని ప్రశ్నించగా.. పీకే సమాధానం చెప్పలేదు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..? అని ప్రశ్నించగా.. అవును ప్రధాని కాగలరంటూ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

Also Read:

National Tourism Policy: భారత పర్యాటక రంగానికి కొత్త జవసత్వాలు.. మోదీ సర్కార్ కీలక విధాన నిర్ణయాలు..

Uttarakhand Elections 2022: దేశం కోసం మా కుటుంబం కూడా త్యాగం చేసింది.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్..