Cheddi Gang – Vijayawada: చడ్డీ గ్యాంగ్ కేసులో కీలక మలుపు.. నిందితుల ఆట కట్టించిన పోలీసులు..!
Cheddi Gang - Vijayawada: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు నిందితులను..
Cheddi Gang – Vijayawada: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మడియా కాంజీ మేడా, సక్ర మండోద్, కమలేష్ బాబేరియాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మొదటి ఇద్దరు నిందితులు గుజరాత్ దాహూద్ జిల్లాలోని గార్బర్డ్ గ్రామానికి చెందినవారు కాగా, మరో వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఝుబువా కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులు ముగ్గురిని సీపీ క్రాంతి టాటా మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు దోపిడీ, వారి వివరాలను మీడియాకు వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘గత నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోరీలు జరిగాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. మరో ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నాం. మొత్తం పది గ్యాంగ్ సభ్యులు ఉన్నట్టుగా గుర్తించాం. మడియా కాంజీ మేదా, సక్ర మందోడ్, కమలేష్ బాబేరియా లుగా నిందితులను గుర్తించాం. ఈ చోరీలకు పాల్పడిన వారు గుజరాత్ గుల్బర్గ్‌కు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించాం. వీరంతా ప్రొఫెషనల్‌గా చోరీ చేసే వాళ్లు. ప్రస్తుతం అరెస్టైన నిందితులు మడియా కంజీ మేడా పై 18, సక్రా మందోడ్ మీద 5, కమలేష్ బబేరియా మీద 3 కేసులు ఉన్నాయి. 2015 నుంచి వీరిపై కేసులున్నాయి. ఏపీ, తమిళనాడులలో కేసులు నమోదయ్యాయి. గత నెల 26న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో విజయవాడకు ఈ గ్యాంగులు వచ్చాయి. ఈనెల 4, 8 తేదీలలో రెండు గ్యాంగులు వెళ్ళిపోయాయి. చడ్డీ గ్యాంగ్ ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రజల నుంచి మంచి మద్ధతు లభించింది. రాత్రి గస్తీపెంచడం కూడా చాలా దోహదపడింది. మిగతా నిందితులు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం అందింది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించాం. ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దోపిడీ ముఠాలకు సంబంధించి సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజలు సైతం తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.’’ అని సీపీ క్రాంతి సూచించారు.
Also read:
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
PM Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక