Hyderabad Crime: గలీజ్ దందాలకు కేరాఫ్ అడ్రస్ నగర శివారు ఫామ్ హౌజ్‌లు.. పోలీసుల తనిఖీల్లో బట్టబయలు!
హైదరాబాద్ విశ్వనగరాల సరసన చేరింది.శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరం నలుమూలాల విస్తరిస్తోంది. ఈ క్రమంలో నగర శివారులో పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్‌లు పుట్టుకొచ్చాయి. ఫామ్ హౌజ్‌ల మాటున గలీజ్ దందాకు తెరలేపాయి. వీకెండ్‌లో రిఫ్రెష్‌మెంట్ పాయింట్స్‌గా ఉండే ఫామ్‌హౌజ్‌లు కొత్త రూటు మార్చాయి. ,
హైదరాబాద్ విశ్వనగరాల సరసన చేరింది.శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరం నలుమూలాల విస్తరిస్తోంది. ఈ క్రమంలో నగర శివారులో పెద్ద ఎత్తున ఫామ్ హౌజ్‌లు పుట్టుకొచ్చాయి. ఫామ్ హౌజ్‌ల మాటున గలీజ్ దందాకు తెరలేపాయి. వీకెండ్‌లో రిఫ్రెష్‌మెంట్ పాయింట్స్‌గా ఉండే ఫామ్‌హౌజ్‌లు, వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి మోడల్స్, యువతులను రప్పించి, వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాయి కొన్ని ముఠాలు. ఆన్‌లైన్‌లో యువతుల ఫొటోలు పెట్టి, బుకింగ్స్ చేస్తున్నారు కేటుగాళ్లు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అంటేనే ఫామ్‌హౌజ్‌లకు కేరాఫ్ అడ్రస్. సిటీ అవుట్ స్కర్ట్స్ దాటితే చాలు… మొయినాబాద్ మొదలుకుని చేవెళ్ల, వికారాబాద్ వరకు వందలాది ఫామ్ హౌజ్‌లు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతోపాటు బడా వ్యాపారవేత్తల ఫామ్‌హౌజ్‌లు కూడా ఇక్కడే ఉన్నాయి. కొన్ని అద్దెకు లభించే ఫామ్‌హౌజ్‌లు కూడా ఉన్నాయి.
వీక్ అంతా వర్క్ స్ట్రెస్‌తో ఉన్న ఉద్యోగులు.. వీకెండ్‌లో సరదాగా గడిపేందుకు ఫామ్‌హౌజ్‌కు వెళ్లి చిల్ అవుతుంటారు. కొందరు ఫ్యామిలీతో, బంధువులతో వెళ్లేవాళ్లుంటారు. కాలేజ్ కుర్రాళ్లు కూడా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసి వస్తుంటారు. మొత్తంగా ఒక రిఫ్రెష్‌మెంట్ పాయింట్స్‌గా ఫామ్‌హౌజ్‌లు ఉండేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు కేటుగాళ్లు. ఫామ్‌హౌజ్‌ల తీరు మారింది. గలీజ్ దందాకు తెరలేపాయి ఫామ్‌హౌజ్‌లు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ పార్టీలకు అనుతిచ్చినా, పేకాట ఆడేందుకు ఫామ్‌హౌజ్ అద్దెకు ఇచ్చినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఫామ్‌హౌజ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు తెరలేపారు. ఫామ్‌హౌజ్‌లను బ్రోతల్ హౌజ్‌లుగా మార్చేశారు.
తెలంగాణ, ఆంధ్రాతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి ఫామ్‌హౌజ్‌లో ఉంచి.. వ్యభిచార దందాకు తెరలేపుతున్నారు ఫామ్‌హౌజ్ నిర్వాహకులు. కొన్ని ఫామ్‌హౌజ్‌లు ఏకంగా బెంగాళ్, ముంబై, బెంగుళూరు నుంచి మోడల్స్‌ను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నాయి. ఎంజాయ్‌మెంట్ కోసం యువకులు ఎవరైనా ఫామ్‌హౌజ్ అద్దెకు కావాలి అని అడిగితే.. అమ్మాయిలు కూడా ఉన్నారంటూ ఆఫర్ ఇస్తున్నారట. కొందరు ఫామ్‌హౌజ్ నిర్వాహకులు.. యువతుల ఫొటోలను ఆన్‌లైన్ పోర్టల్స్ లో ఉంచి బుకింగ్ చేసుకున్న కస్టమర్లను తమ ఫామ్‌హౌజ్‌కు రప్పించుకుంటున్నారు.
కొంతకాలంగా ఫామ్‌హౌజ్‌లపై నిఘా పెట్టిన మొయినాబాద్ పోలీసులు దాడులు చేశారు. మొయినాబాద్ పరిధిలోని హ్యాపీహోమ్స్ ఫామ్‌హౌజ్‌లో వ్యభిచార ముఠా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ముగ్గురు అమ్మాయిలతోపాటు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లు, ఒక ఫామ్‌హౌజ్ వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే మొయినాబాద్ పరిధిలోని రాజ్ ఫామ్‌హౌజ్ పైనా దాడి చేశారు పోలీసులు. ఈ ఫామ్‌హౌజ్‌లో కూడా మరో వ్యభిచారముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు మోడల్స్‌తోపాటు… ముగ్గురు విటులు, ఓ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల నగరం నడిబొడ్డున్న అబిడ్స్‌లోని హోటల్ ఫార్చూన్ రెసిడెన్సీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా కింగ్‌పిన్.. అఖిల్ పైల్వాన్ కూడా సిటీ శివారులోని ఫామ్‌హౌజ్‌ల్లో వ్యబిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఫామ్‌హౌజ్‌లపై నిఘా పెంచామని, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే ఫామ్‌హౌజ్‌లను ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. కొందరు ఫామ్‌హౌజ్ నిర్వాహకులు.. తమ ఓనర్‌కి తెలియకుండానే ఇలాంటి దందాలు కూడా నడిపిస్తున్నారంటున్నారు పోలీసులు. ఇలాంటి వారి విషయంలో ఫామ్‌హౌజ్ ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…