Stealing iPhones: పట్టపగలు.. అందరూ చూస్తుండగానే 40 ఐఫోన్లు కొట్టేసిన దొంగ.

Stealing iPhones: పట్టపగలు.. అందరూ చూస్తుండగానే 40 ఐఫోన్లు కొట్టేసిన దొంగ.

Anil kumar poka

|

Updated on: Feb 10, 2024 | 7:23 PM

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో షాకింగ్ ఘటన జరిగింది. రెచ్చిపోయిన ఓ దొంగ అందరూ చూస్తుండగానే ఓ యాపిల్ స్టోర్‌లో ఏకంగా 40 ఐఫోన్లను కొట్టేశాడు. వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుంది. ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్న దొంగ ఈ చర్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్టోర్ సిబ్బంది, పలువురు కస్టమర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. స్టోర్‌లోని మూడు డిస్‌ప్లే టేబుళ్లపై ఉన్న ఐఫోన్‌లను దొంగ తీస్తుండగా అందరూ చూస్తుండిపోవడం వీడియోలో కనిపించింది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో షాకింగ్ ఘటన జరిగింది. రెచ్చిపోయిన ఓ దొంగ అందరూ చూస్తుండగానే ఓ యాపిల్ స్టోర్‌లో ఏకంగా 40 ఐఫోన్లను కొట్టేశాడు. వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుంది. ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్న దొంగ ఈ చర్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్టోర్ సిబ్బంది, పలువురు కస్టమర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. స్టోర్‌లోని మూడు డిస్‌ప్లే టేబుళ్లపై ఉన్న ఐఫోన్‌లను దొంగ తీస్తుండగా అందరూ చూస్తుండిపోవడం వీడియోలో కనిపించింది. ఫోన్లు తీసుకొని దొంగ పారిపోయాడు. దొంగతనం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఒక పోలీసు వాహనం కూడా ఉంది. వీడియోను ఓ వ్యక్తి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు టైలర్ మిమ్స్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. కాగా నిందితుడు మిమ్స్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దొంగ మిమ్స్ పరిగెత్తిన వీధిలో ఓ పోలీసు వాహనం కనిపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో వాహనంలో పోలీసులు ఎవరూ లేరని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అమల్లో ఉందా లేదా అని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా స్పందించారు. దొంగతనానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసి ‘దీనిపై మీ అభిప్రాయం ఏంటి’ అని ట్రంప్ ప్రశ్నించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..