Pre-Wedding Shoot: ఆపరేషన్ రూమ్‌లో ప్రీవెడ్డింగ్ షూట్.. రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లుగా వీడియోలు.
వివాహనికి ముందు ప్రీవెడ్డింగ్‌ల పేరిట కొత్త ట్రెండ్ మొదలైన ఈ రోజుల్లో కర్ణాటకకు చెందిన యువ వైద్యుడు వినూత్నంగా ఆలోచించాడు. భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న అతడు.. ఆపరేషన్ థియేటర్ గదినే అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు.
వివాహనికి ముందు ప్రీవెడ్డింగ్‌ల పేరిట కొత్త ట్రెండ్ మొదలైన ఈ రోజుల్లో కర్ణాటకకు చెందిన యువ వైద్యుడు వినూత్నంగా ఆలోచించాడు. భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న అతడు.. ఆపరేషన్ థియేటర్ గదినే అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఆసుపత్రులను స్థాపించింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని, వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి అన్నారు. వైద్యులు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్నారు. హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది తమ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించినట్లు తెలిపారు, సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణపై ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

