ప్రేమోన్మాదానికి మరో యువతి బలి.. కీచకుడి వెకిలి చేష్టలు భరించలేక ఆత్మహత్య
ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ప్రేమ పేరుతో నీచుడి వేధింపులు తాళలేకపోయింది. ఇష్టం లేదని చెప్పినా మూర్ఖత్వపు చేష్టలు మానుకోలేదు.
Young lady suicide : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ప్రేమ పేరుతో నీచుడి వేధింపులు తాళలేకపోయింది. ఇష్టం లేదని చెప్పినా మూర్ఖత్వపు చేష్టలు మానుకోలేదు. పదే పదే వద్దన్న పట్టించుకోలేదు. చేసేదీలేక తానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాదఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఉన్మాది వెకిలి చేష్టలు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది లిజా. రాజేంద్రనగర్ మైలార్ దేవర్‌పల్లిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓవైపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మరోవైపు అదే సమయంలో ఆ ఆడబిడ్డ బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మీగూడలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న లిజాను.. అదే ప్రాంతానికి చెందిన అష్రాఫ్ అనే యువకుడి కన్నుపడింది.
గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. తనకిష్టంలేదని ఎంత చెప్పినా వినని ఆ మూర్ఖుడు..రోజూ ఆమె వెంటపడేవాడు. కొద్ది రోజులు ఆ ఉన్మాది వెకిలి చేష్టలను ఎలాగోలా భరించిన లిజా..ఇక, అతడి వేధింపులు తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అష్రాఫ్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండిః
భార్య కాపురానికి రావటంలేదని దారుణానికి ఒడిగట్టిన భర్త.. నిప్పంటుకుని దంపతుల దుర్మరణం