సీఎం కేసీఆర్ పీఏ అంటూ మోసం.. అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

మరో కేటుగాడు పట్టుబడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెక్రెటరీ అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న బుర్ర కమల్ కృష్ణను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖుల పేర్లు చెబుతూ వ్యాపారులను మోసం చేయడంలో...

సీఎం కేసీఆర్ పీఏ అంటూ మోసం.. అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
Burra Kamal Krishna Goud

మరో కేటుగాడు పట్టుబడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెక్రెటరీ అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న బుర్ర కమల్ కృష్ణను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖుల పేర్లు చెబుతూ వ్యాపారులను మోసం చేయడంలో ఆరితేరాడు. వివిధ పార్టీలకు చెందిన వారిని టార్గెట్ చేసి బీసీ కార్పొరేషన్‌లో పదవి ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

సీఎం పేషీలో వ్యక్తిగత కార్యదర్శి అంటూ ఫోన్లు చేయడం అందినకాడికి దండుకోవడం ఇతనే నిత్యం చేస్తున్న పని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇతనిది కరీంనగర్ సొంత జిల్లా అని.. ఓ యూట్యూబ్ ఛానల్‌లో పని చేస్తున్నాడని వెల్లడించారు. ప్రముఖుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి : Minister Anil Kumar: ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదు.. కేటాయింపులకు లోబడే నిర్మాణాలు

Bonalu: ఈ ఏడాది ఘనంగా బోనాల జాతర.. జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు

IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..