AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో దారుణం.. దయ్యం పట్టిందని కొడుకుని కొట్టి చంపిన కసాయి

Mother Kills His Son: తమిళనాడులో దారుణం జరిగింది. కన్న కొడుకును తల్లి కొట్టి.. కొట్టి చంపింది. కొడుక్కి దెయ్యం పట్టిందంటూ కన్న తల్లి కొట్టి చంపిన ఘటన తిరువన్నామలై జిల్లా అరణిలో జరిగింది.

తమిళనాడులో దారుణం.. దయ్యం పట్టిందని కొడుకుని కొట్టి చంపిన కసాయి
Mother Kills His Son
Sanjay Kasula
|

Updated on: Jun 21, 2021 | 7:58 PM

Share

తమిళనాడులో దారుణం జరిగింది. కన్న కొడుకును తల్లి కొట్టి.. కొట్టి చంపింది. కొడుక్కి దెయ్యం పట్టిందంటూ కన్న తల్లి కొట్టి చంపిన ఘటన తిరువన్నామలై జిల్లా అరణిలో జరిగింది. తల్లితోపాటు ముగ్గురు మహిళలు ఏడేళ్ల బాలుడిని చిత్రహింసలు పెడుతున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలంకు చేరుకునే సరికి బాలుడిని అప్పటికే కొట్టి చంపేశారు. దీంతో వెంటనే బాలుడి తల్లితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో చిన్నారి తల్లితో సహా ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు.

కొడుకుకి దెయ్యం పట్టిందని అందుకే పూజలు చేసే క్రమంలో పిల్లాడు చనిపోయాడని పోలీసులకు తెలిపింది ఆ కసాయి తల్లి. మరో వైపు కన్నతల్లి సపర్యమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని డబ్బుల కోసమే ఇదంతా జరిగి ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో ఇద్దరు మహిళలు ఆమెను మాయ మాటలతో మోసం చేసి పిల్లాడిని చంపేలా చేశారని తల్లికి మతిస్థిమితం సరిగా లేదని ఆమెను మోసం చేసి ఇలా చేయించారంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  దీంతో చిన్నారి తల్లితో సహా ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఏది ఏమైనా మూఢవిశ్వాసం ఏడు సంవత్సరాల బాలుడి బలి తీసుకుంది. చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లిని నిజంగా మతిస్థిమితం లేదా? లేదా…తల్లితో పాటు పిల్లాడిని హింసించిన మరో ఇద్దరు మహిళలు ఎవరు? ఎందుకిలాచేశారని కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వీరికి ఇలా చేయమని చెప్పింది ఎవరూ అనేది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Minister Anil Kumar: ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదు.. కేటాయింపులకు లోబడే నిర్మాణాలు

Bonalu: ఈ ఏడాది ఘనంగా బోనాల జాతర.. జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు

IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..