AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి: బ్యాంకు ఉద్యోగి సూసైడ్

‘నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేనే చనిపోతున్నా.. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి.. అలాగే నాకు ఇవ్వాల్సిన డబ్బులతోనే కర్మఖాండ’ చేయలంటూ ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రావణ్ కుమార్(29) ఏడాది క్రితం సూర్యపేటకు చెందిన హరితను వివాహం చేసుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం […]

నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి: బ్యాంకు ఉద్యోగి సూసైడ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 4:53 PM

Share

‘నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేనే చనిపోతున్నా.. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి.. అలాగే నాకు ఇవ్వాల్సిన డబ్బులతోనే కర్మఖాండ’ చేయలంటూ ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రావణ్ కుమార్(29) ఏడాది క్రితం సూర్యపేటకు చెందిన హరితను వివాహం చేసుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రావణ్ గదిలోకి వెళ్లి.. తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని.. మద్యంలో కలుపుకుని తాగేశాడు. కాసేపటికి ఆ బాధను తట్టుకోలేక.. తలుపులను కొట్టాడు. దొంగలని భయపడిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకునే లోపే.. శ్రావణ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా.. శ్రావణ్ మరణించే ముందు ఓ సూసైడ్ లెటర్ రాశాడు. అందులో ‘తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన తండ్రికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, నేను అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చే దాకా నాకు కర్మఖాండ చేయొద్దని, అలాగే తన భార్య చాలా మంచిదని.. ఆమెకు వేరే పెళ్లి చేయాలని’ ఆ లేఖలో రాశాడు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం