AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి.. CCTVలో షాకింగ్ దృశ్యాలు!

తూర్పు ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూర్ విహార్‌లోని లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. స్పోర్ట్స్ పీరియడ్ ముగించుకుని క్లాసు రూమ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. బాలిక అకస్మాత్తుగా కిందపడిపోవడం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

స్కూల్‌లో విషాదం.. క్లాస్‌రూమ్‌లో కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి.. CCTVలో షాకింగ్ దృశ్యాలు!
Tragedy At Delhi School
Balaraju Goud
|

Updated on: Nov 04, 2026 | 3:21 PM

Share

తూర్పు ఢిల్లీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మయూర్ విహార్‌లోని లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. స్పోర్ట్స్ పీరియడ్ ముగించుకుని క్లాసు రూమ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. బాలిక అకస్మాత్తుగా కిందపడిపోవడం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటన

నవంబర్ 4, 2026న ఉదయం సుమారు 9:52 గంటలకు బాలిక అస్వస్థతకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ రాడిక్స్ హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

CCTV ఫుటేజీలో ఏం కనిపించింది?

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బాలిక తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం కెమెరాల్లో రికార్డయింది. స్పోర్ట్స్ పీరియడ్ అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలిక ఎందుకు స్పృహ కోల్పోయింది? ఆమెకు అప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. కొనసాగుతున్న దర్యాప్తు!

ఈ ఘటనపై పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బాలిక తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలతో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా గుండె సంబంధిత సమస్య కారణంగా బాలిక మరణించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వైద్యపరమైన పరీక్షలు, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల చిన్నారి ఇలా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దర్యాప్తు, వైద్య నివేదికలో వెల్లడయ్యే వివరాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us