AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.15కే 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా

Jio Plan: ప్రస్తుతం చాలామంది మొబైల్ ఫోన్లలోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ చూస్తున్నారు. అయితే ఎక్కువ నాణ్యతతో వీడియోలు చూసేటప్పుడు అధిక మొత్తంలో డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో జియో కొత్త ప్యాక్ ద్వారా 4K, అల్ట్రా హెచ్‌డీ వీడియో..

Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.15కే 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా
Jio
Subhash Goud
|

Updated on: Nov 04, 2026 | 6:25 PM

Share

Jio Unlimited 5G Data Pack: టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న రిలయన్స్ జియో మరో కొత్త డేటా ప్యాక్‌ను ప్రకటించింది. కేవలం రూ.15 ధరతో 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా అందించే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. అధికంగా ఇంటర్నెట్ వినియోగించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా సినిమాలు చూసేవారు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు, పెద్ద మొత్తంలో ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడనుంది.

రిలయన్స్ జియో రూ.15కే ఆన్‌లిమిటెడ్ 5G డేటా ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్ 24 గంటల పాటు అపరిమిత హై-స్పీడ్ 5G డేటాను అందిస్తుంది. కంపెనీ ప్రకారం, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ఈ ప్యాక్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ జియో డేటా ప్యాక్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు దీనిని MyJio యాప్, Jio.com, రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జనరల్ ట్రేడ్ POS, థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర రీఛార్జ్ మార్గాల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: BSNL: కేవలం 1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మతిపోగొట్టే ప్లాన్‌..!

జియో రూ.15 డేటా ప్యాక్ వివరాలు:

జియో కొత్త రూ.15 డేటా ప్యాక్ వ్యాలిడిటీ 1 రోజు (24 గంటలు). ఇది ట్రూలీ అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. కంపెనీ ప్లాన్ వివరాల ప్రకారం, ఈ ప్యాక్ అన్ని టెలికాం సర్కిళ్లలో వర్తిస్తుంది.

4K వీడియోలు, సినిమాలు చూడొచ్చు

ప్రస్తుతం చాలామంది మొబైల్ ఫోన్లలోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ చూస్తున్నారు. అయితే ఎక్కువ నాణ్యతతో వీడియోలు చూసేటప్పుడు అధిక మొత్తంలో డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో జియో కొత్త ప్యాక్ ద్వారా 4K, అల్ట్రా హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అలాగే వీడియోలు చూస్తున్నప్పుడు బఫరింగ్ సమస్యలు తగ్గుతాయని తెలిపింది.

అదనంగా ఇది ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లలో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి 5G మొబైల్ ఫోన్‌ను హాట్‌స్పాట్‌గా కూడా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. రిమోట్‌గా పనిచేస్తూ, ఎక్కువ డేటా వాడే కస్టమర్లకు ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి ఉపయోగం

మొబైల్ గేమింగ్ ఇష్టపడేవారికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా మల్టీప్లేయర్ గేమ్స్ ఆడేవారు హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరాన్ని ఎదుర్కొంటారు. జియో 5G నెట్‌వర్క్ ద్వారా తక్కువ లేటెన్సీతో గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

భారీ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

పెద్ద సైజు గేమ్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేసుకునేవారికి ఈ ప్యాక్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలకు మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇంటర్నెట్‌ను కూడా షేర్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

  • జియో రూ.15 ప్లాన్ వివరాలు ఇవే:
  • ధర – రూ.15
  • వ్యాలిడిటీ – 1 రోజు (24 గంటలు)
  • డేటా – అన్‌లిమిటెడ్ 5G డేటా
  • నెట్‌వర్క్ – Jio True 5G
  • అందుబాటు దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లు
Jio

Jio

ఇది కూడా చదవండి: Dhanteras: ధంతేరస్ నాడు బంగారం కొంటున్నారా? పేమెంట్‌ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Jio గుడ్‌న్యూస్..కేవలం రూ.15కే 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా
Jio గుడ్‌న్యూస్..కేవలం రూ.15కే 24 గంటల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా
పరుగులు చేయకపోయిన మ్యాచ్‎ను గెలిపించింది మాత్రం రోహితే
పరుగులు చేయకపోయిన మ్యాచ్‎ను గెలిపించింది మాత్రం రోహితే
పేదల రేషన్ బియ్యానికి బ్రాండెడ్ ముసుగు.. 28 పేర్లతో భారీ దందా!
పేదల రేషన్ బియ్యానికి బ్రాండెడ్ ముసుగు.. 28 పేర్లతో భారీ దందా!
ఆక్లాండ్‌లో వన్డే మ్యాచే కోహ్లీ చివరి వన్డేనా?
ఆక్లాండ్‌లో వన్డే మ్యాచే కోహ్లీ చివరి వన్డేనా?
డిసెంబర్‌ 1 నుంచి ఈ బ్యాంకు నిబంధనలలో కీలక మార్పులు.. ఇక బాదుడే!
డిసెంబర్‌ 1 నుంచి ఈ బ్యాంకు నిబంధనలలో కీలక మార్పులు.. ఇక బాదుడే!
4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం!
4 కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం!
అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?
అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?
98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!
98.6°F లెక్క మారిందా? స్టాన్‌ఫోర్డ్ స్టడీలో ఆసక్తికర విషయాలు!
1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..బీఎస్‌ఎన్‌ఎల్‌ మతిపోగొట్టే ప్లాన్
1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ..బీఎస్‌ఎన్‌ఎల్‌ మతిపోగొట్టే ప్లాన్
పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !
పెళ్లి జీవితంలో ఎదురైన కష్టాలు చెబుతూ కన్నీళ్లు !