AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పోలీసోడు మహా కిలాడీ.. ఖాకీ మాటున కక్కుర్తి.. గుట్టచప్పుడు కాకుండా కానిచ్చేశాడు!

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. ప్రభుత్వ ఆస్తులపై కన్నేశాడు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఖాకీనే.. చట్టానికి తూట్లు పొడిచాడు. తన అవసరాలు, జల్సాల కోసం ఓ ఖాకీ మాత్రం పోలీస్ స్టేషన్‌లోనీ వాహనాలను మాయం చేశాడు. ఇంతకీ ఆ ఖాకీ కిలాడీ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఈ పోలీసోడు మహా కిలాడీ.. ఖాకీ మాటున కక్కుర్తి.. గుట్టచప్పుడు కాకుండా కానిచ్చేశాడు!
Police Constable Suspended
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 04, 2026 | 3:38 PM

Share

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. ప్రభుత్వ ఆస్తులపై కన్నేశాడు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఖాకీనే.. చట్టానికి తూట్లు పొడిచాడు. తన అవసరాలు, జల్సాల కోసం ఓ ఖాకీ మాత్రం పోలీస్ స్టేషన్‌లోనీ వాహనాలను మాయం చేశాడు. ఇంతకీ ఆ ఖాకీ కిలాడీ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో ఉంది. నిత్యం వాహనాల రాకపోకలతో పోలీస్ స్టేషన్ సందడిగా ఉంటుంది. అయితే కరోనా సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో బైకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ వాహనాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో భద్రపరిచారు. ప్రజల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు పోలీసుల సంరక్షణలో ఉండాలి. కేసుల విచారణ పూర్తయ్యే వరకు వాటిని భద్రపరచాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ ఇదే బాధ్యతను ఆసరాగా చేసుకుని అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన కానిస్టేబుల్ సైదులు.. ఆ బైకులపైనే కన్నేశాడు. స్టేషన్‌లో ఉండాల్సిన బైకులను ఒక్కొక్కటిగా బయటకు తరలించి.. తన వ్యక్తిగత అవసరాలు, జల్సాల కోసం సీజ్ చేసిన బైక్ లను మాయం చేశాడు. ఒక్కో బైక్‌ను ఐదు నుంచి పది వేల రూపాయలకే విక్రయించాడు.

కానిస్టేబుల్ సైదులు ప్రస్తుతం కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. అయితే పాత వ్యవహారం ఇప్పుడు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. కానిస్టేబుల్ సైదులును సస్పెండ్ చేశారు. అంతేకాదు.. సీజ్ చేసిన బైకులు మాయమైన వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us