AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husband Killed: భార్య చేతిలో భర్త హతం..? చిత్రహింసలకు గురిచేసి చంపిందంటూ ఆరోపణలు

Husband Killed: మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో దారుణం చేసుకుంది. భార్య చేతిలో ఓ భర్త హతమైనట్టుగా ఆరోపణలుగుప్పుమంటున్నాయి‌. అలా ఇలా కాదు కర్రలు,..

Husband Killed: భార్య చేతిలో భర్త హతం..? చిత్రహింసలకు గురిచేసి చంపిందంటూ ఆరోపణలు
Subhash Goud
|

Updated on: Dec 10, 2021 | 12:58 AM

Share

Husband Killed: మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో దారుణం చేసుకుంది. భార్య చేతిలో ఓ భర్త హతమైనట్టుగా ఆరోపణలుగుప్పుమంటున్నాయి‌. అలా ఇలా కాదు కర్రలు, రాడ్లతో చితకబాది చివరకు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిత్యం పిల్లల ముందు తనపై దాడి చేస్తున్న భార్య తీరును తట్టుకోలేక భర్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతుడి తల్లిదండ్రులతో మాట్లాడిన.. గని‌ నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చిన విచక్షణా రహితంగా కొడుతుందని.. డిసెంబర్ 2 న కూడా అదే జరిగిందని.. అయితే ఈ సారి ఏకంగా ముస్తఫాకు పురుగుల మందు తాగించి హత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి జారుకుందని చెపుతున్నారు. పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి‌ నుండి సమాచారం రావడంతో ముస్తఫాను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని.. వారం రోజుల చికిత్స అనంతరం ముస్తఫా మృతి చెందాడని ఆయన తల్లి కన్నీరు మున్నీరవుతోంది.

అయితే ఇక్కడి వరకు పలు అనుమానాలున్నా.. ముస్తపా సెల్ పోన్ లో రికార్డ్ అయిన సెల్పీ వీడియో లు మాత్రం భార్య రుబినా సైకోయిజాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పిల్లల ఎదుటే తన భార్య తనను నిత్యం చితకబాదుతుందంటూ సెల్ పోన్ లో సెల్పీ వీడియోలు రికార్డ్ చేసుకున్నాడు ముస్తపా. తనను తన భార్య రుబీనా చిత్రహింసలకు గురి చేస్తుందంటూ సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. కర్రలతో , కుర్చీలతో విచక్షణ మరిచి భర్త పై దాడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ముస్తప బందువులను షాక్ కు గురి చేస్తున్నాయి. సాదరణంగా భార్య పై భర్త దాడి ఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటే మంచిర్యాల జిల్లాలో మాత్రం అందుకు విరుద్దం అన్న తీరుగా భర్తను భార్యే చిత్రహింసలకు గురి చేసి.. చివరికి హత్య చేసిందన్న ఆరోపణలు షాక్ కు గురి చేస్తున్నాయి. ముస్తప బందువులు ఇచ్చిన ఫిర్యాదు తో హత్యకేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు‌ చేపట్టారు. ప్రస్తుతం భార్య రుబినా పరారీలో ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Nellore Road Accident: వాగులో కొట్టుకుపోయిన ఆటో.. ఐదుగురు గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం