Andhra Pradesh: స్టేషన్ కు చేరిన విచిత్ర కేసు.. బుగ్గ కొరికేశాడంటూ భర్తపై ఫిర్యాదు.. కంగుతిన్న పోలీసులు
భార్యాభర్తలన్నాక అలకలు, గొడవలు సాధారణమే. అసలు అలాంటి అలకలు లేని సంసార జీవితం బోరింగ్ కూడా. ఆ అలకలు, గొడవలు చిన్నచిన్నవే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు...
భార్యాభర్తలన్నాక అలకలు, గొడవలు సాధారణమే. అసలు అలాంటి అలకలు లేని సంసార జీవితం బోరింగ్ కూడా. ఆ అలకలు, గొడవలు చిన్నచిన్నవే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. అందుకే మొగుడుపెళ్లాల బంధం చాలా సున్నితమైనది. దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. అలా చేస్తే వారి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమర్థంగా తట్టుకోగలరని పెద్దలు చెబుతుంటారు. కాగా.. ప్రస్తుతం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త బుగ్గ కొరికేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కానూరు కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతను మద్యానికి బానిసయ్యాడు. మందు తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడ్డాడు. వారిద్దరి మధ్య వివాదం మరింతగా ముదిరింది. కోపంతో ఊగిపోయిన రాంబాబు స్రవంతి బుగ్గను కొరికేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..