మావోయిస్టుల ఘాతుకం..నలుగురు గ్రామస్తులు హతం

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు మెటాపాల్ కుస్నార్ గ్రామానికి చెందిన 25 మంది స్థానికుల్ని కిడ్నాప్ చేశారు...

  • Jyothi Gadda
  • Publish Date - 12:34 pm, Sat, 5 September 20
మావోయిస్టుల ఘాతుకం..నలుగురు గ్రామస్తులు హతం

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు మెటాపాల్ కుస్నార్ గ్రామానికి చెందిన 25 మంది స్థానికుల్ని కిడ్నాప్ చేశారు. పోలీసు ఇన్‌ఫార్మ‌ర్ల నెపంతో గ్రామస్తులను కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం వారిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అనంతరం కిడ్నాప్ చేసిన వారిలో నలుగురు గ్రామస్తులను హత్యచేశారు. ఐదుగురిని విడుదల చేసినట్లుగా తెలుస్తోది. ఈ ఘ‌ట‌న దంతెవాడ‌, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దులో రాత్రి జరిగినట్లుగా సమాచారం.