Crime News: దారుణం.. దళిత కుటుంబంలోని నలుగురి హత్య.. బాలికపై అఘాయిత్యం..
Dalit family killed: ఉత్తరప్రదేశ్‌లో దళిత కుటుంబం హత్య, బాలికపై సామూహిక అత్యాచారం సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదం
Dalit family killed: ఉత్తరప్రదేశ్‌లో దళిత కుటుంబం హత్య, బాలికపై సామూహిక అత్యాచారం సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదం నేపథ్యంలో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని నిందితులు దారుణంగా హత్య చేశారు. దీంతోపాటు టీనేజ్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చోటుచేసుకుంది. దళిత కుటుబంలోని భూ యజమాని (50), ఆయన భార్య (47), కుమార్తె (17), కొడుకు(10)ని గ్రామానికి చెందిన కొందరు దుండగులు గొడ్డలితో నరికి హత్యచేశారు. ఈ ఘటన గురువారం యూపీలో కలకలం రేపింది. అనంతరం ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి.
కాగా.. ఈ ఘటనకు సంబంధించి 11 మంది నిందితుల్లో 8 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి తెలిపారు. బాధితులను గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందన్నారు. మృతదేహాల వద్ద గొడ్డళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా తక్షణ సాయం 16 లక్షలను అందించామని అలహాబాద్ అధికారులు తెలిపారు. భాధిత కుటుంబానికి లైసెన్సెడ్ తుపాకీ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అలసత్వం వహించిన స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు డీఐజీ తెలిపారు.
ఈ ఘటనపై డీఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి గ్రామంలోని కొంతమందిపై SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. దుండగులు గొడ్డలితో హత్యచేశారని.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటన అనంతరం విపక్ష పార్టీల నేతలు.. యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: