AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే రోజు నాలుగు హత్యలు.. భాగ్యనగరంలో భయం భయం

హైదరాబాద్‌లో ఒకేరోజు నాలుగు హత్యలు జరగడం కలకలం రేపింది. లంగర్‌హౌస్ లోని ఎండి లైన్స్‌లో ఓ కారుతో బైక్‌ను ఢీకొట్టి మహ్మద్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. ఇతనిపై గోల్కొండ పోలీస్టేషన్‌లో అనేక కేసులున్నాయి..పోలీస్టేషన్‌లో మహ్మద్‌పై రౌడీషీట్‌ ఉంది.

ఒకే రోజు నాలుగు హత్యలు.. భాగ్యనగరంలో భయం భయం
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 10:07 AM

Share

హైదరాబాద్‌లో ఒకేరోజు నాలుగు హత్యలు జరగడం కలకలం రేపింది. లంగర్‌హౌస్ లోని ఎండి లైన్స్‌లో ఓ కారుతో బైక్‌ను ఢీకొట్టి మహ్మద్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. ఇతనిపై గోల్కొండ పోలీస్టేషన్‌లో అనేక కేసులున్నాయి..పోలీస్టేషన్‌లో మహ్మద్‌పై రౌడీషీట్‌ ఉంది. లంగర్ హౌస్ లోని సంఘటనాస్థలాన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పరిశీలించారు.

హత్య జరిగింది ఇలా…

మొదట మహమ్మద్ ‌ కోసం కాపు కాసి కారుతో బైక్ ను ఢీకొట్టారు. ఆ తర్వాత కిందపడ్డ వెంటనే కత్తులతో విరుచుకుపడ్డారు. రౌడీషీటర్ తో పాటు అతని మిత్రుడ్ని విచక్షణారహితంగా మారణాయుధాలతో పొడిచి చంపేశారు దుండగులు. హైదరాబాద్ గొల్కోండ ప్రాంతంలో నివాసముండే మహమ్మద్ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్నాడు. మెహిదీపట్నంలో చికెన్ షాపు నడిపే ఫయాజుద్ధీన్‌తో కలిసి రాత్రి బైక్ పై బయలుదేరాడు మహమ్మద్. అయితే వెనుక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ కారు ఒక్కసారిగా మహమ్మద్, ఫయాజుద్ధీన్‌ల బైక్ ను ఢీకొట్టింది. దీంతో కిందపడిన వెంటనే కత్తులతో దాడి చేశారు. అయితే ఘటనా స్థలంలోనే మహమ్మద్ మృతి చెందాడు. అతని స్నేహితుడు ఫయాజ్ మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

ఇవే ఆధారాలు…

హత్యలు చేసిన వెంటనే కారును అక్కడే వదిలి పరారయ్యారు నిందితులు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్, వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ , పోలీసు అధికారులు, క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని.. హత్యలకు గల కారణాలేమిటనేది దర్యాప్తులో తెలుస్తుందంటున్నారు పోలీసులు.

గోల్కొండ, రెయిన్ బజార్‌లో…

నిన్న(05జూన్) ఒకేరోజు హైదరాబాద్ లో మొత్తం నాలుగు హత్యలు జరిగాయి. గోల్కొండలో రాహుల్ అనే యువకుడిని అతని మిత్రుడు అజార్ హత్య చేశాడు. అటు రెయిన్ బజార్ లో కూడా మరో హత్య జరిగింది. ఇమ్రాన్ అనే యువకుడిని అతని బంధువులే హత్య చేశారు. ఒకేరోజు నాలుగు హత్యలు జరగడంతో హైదరాబాద్‌వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

గోల్కొండ పోలీస్టేషన్‌ పరిధిలో…

గోల్కొండ పోలీస్టేషన్‌ పరిధిలోనే మరో హత్యాయత్నం జరిగింది. షారుఖ్‌ అనే వ్యక్తి అర్భాజ్‌ సోదరిపై కామెంట్‌ చేయటంతో షారుఖ్‌పై దాడి చేశాడు అర్భాజ్‌. తీవ్రంగా గాయపడిన షారుఖ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్