AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ల దారుణ‌ హత్యలు..క‌త్తుల‌తో వెంటాడి..

హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ల దారుణ‌ హత్యలు..క‌త్తుల‌తో వెంటాడి..
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2020 | 6:39 AM

Share

హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. నడి రోడ్డు మీద ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌త్య‌ర్థులు కత్తులతో దాడికి తెగ‌బ‌డ‌టంతో రౌడీ షీటర్లు స్పాట్ లోనే మృతి చెందారు. చ‌నిపోయిన‌వారిని ఫయాదుద్దీన్, ఛాందీ మహ్మద్ లుగా గుర్తించారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డవారిని అష్రఫ్ ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు.

రోడ్డుపై ఉన్న ఛాందీ మహ్మద్, ఫయాదుద్దీన్‌ను మొద‌ట‌ కారుతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. మృతులు మహ్మద్, ఫయాదుద్దీన్ గోల్కొండ ప్రాంతవాసులని తెలుస్తోంది. రౌడీ షీట‌ర్ల‌ను చంపిన‌ అనంతరం దుం‌డగులు ఘటనాస్థలంలోనే కారును వదిలేసి వెళ్లిపోయారు. హత్యల విషయాన్ని తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ వెంట‌నే వ‌చ్చి ఘటనా స్థలిని పరిశీలించారు. నిందితులను అతి త్వ‌ర‌గా పట్టుకుంటామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Follow Us
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. చాహల్ సంచలన వ్యాఖ్యలు
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. చాహల్ సంచలన వ్యాఖ్యలు
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
100 కిలోల కుండను తాకకుండా కదిలించాలి.. ఎలా? చిక్కుప్రశ్న
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..