Reactor Blast: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలి నలుగురు మృతి

Accident in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. కడలూర్‌లోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ పేలి

Reactor Blast: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలి నలుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం/నమూన చిత్రం

Accident in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. కడలూర్‌లోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం వేళ ఈ ఘోర ప్రమాదం జరిగింది. కడలూరులోని రసాయన పరిశ్రమలో కార్మికులు పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా బాయిలర్ పేలిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాయిలర్‌ పేలుడుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

మృతుల బంధువులు, క్షతగాత్రుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు, పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల కాలంలో టపాసుల తయారీ కార్మాగారాల్లో ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

ఫీజు చెల్లించడానికి డబ్బు లేకపోతే 9వ తరగతిలో చదువు ఆపేశాడు.. తాను నమ్మిన ఆటను ప్రేమించాడు.. శిఖరాలను అధిరోహిస్తున్నాడు

BJP MLA: పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా.. ఎంపీలుగా కొనసాగనున్న నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌