- Telugu News Photo Gallery Sports photos Class 9 dropout hardik pandya financial conditions made him now
ఫీజు చెల్లించడానికి డబ్బు లేకపోతే 9వ తరగతిలో చదువు ఆపేశాడు.. తాను నమ్మిన ఆటను ప్రేమించాడు.. శిఖరాలను అధిరోహిస్తున్నాడు
హార్దిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్... గత కొన్నేళ్లుగా తన ఆటతీరుతోనే కాకుండా తన స్టైల్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు.
Updated on: May 13, 2021 | 2:02 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చోటు సంపాదించినప్పటి నుంచి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను కొనసాగిస్తున్నాడు. నేడు కోట్లు సంపాదిస్తాడు. టీమిండియా, ఐపీఎల్‌లో ఆడటమే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ నుంచి కూడా చాలా డబ్బును సంపాదిస్తాడు.

ముంబైలో ఈ మధ్యే ఓ ఇంటిని కొన్నాడు హార్దిక్ పాండ్యా. ఈ ఇంట్లోనే పాండ్యా మొత్తం కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని చెవి రింగుతో మెరిపోతుంటాడు. అంతే కాదు పాండ్యా చేతికి ఉండే బ్రాస్లెట్‌తోపాటు మెడలో ఎప్పుడూ డైమండ్ లాకెట్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తాయి.

గుజరాత్‌లోని సూరత్‌లో 11 అక్టోబర్ 1993న హార్దిక్ పాండ్యా జన్మించాడు. అతని తండ్రి కార్ ఫైనాన్స్ కంపెనీ నడిపిస్తుండే వాడు. పిల్లలను క్రికెటర్లుగా చేయడానికి అన్నింటినీ వదిలి వడోదర వద్దకు వచ్చాడు. ఇక్కడ అతను మొత్తం కుటుంబంతో ఒక చిన్న ఇంట్లో నివసించాడు. హార్దిక్ అతని సోదరుడు క్రునాల్ ఆ సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇద్దరు సోదరులు డబ్బు లేకపోవడం వల్ల రోజుకు రెండుసార్లు నూడిల్స్ తినేవారు.

హార్ధిక్ పాండ్యా చదువుకున్నది కేవలం ఎనిమిదవ తరగతి మాత్రమే... అయినప్పటికీ, చదువు పూర్తి చేయకపోవటానికి ఆర్ధిక కారణాలే అని అప్పుడప్పుడు అంటుంటాడు.

హార్ధిక్ పాండ్యా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన చిన్ననాటి సంగతులను పంచుకున్నాడు. తన చదువు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఫీజులు కట్టలేని పరిస్థితుల్లోనే చదువును నిలివేసినట్లుగా తెలిపాడు.




