దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాగ్‌పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. జిల్లాకు చెందిన మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు..
యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాగ్‌పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. జిల్లాకు చెందిన మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు దుండగులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం నాడు ఉదయం.. తన పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై కాల్పులకు దిగారు. ఈ సంఘటన బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Baghpat: Former BJP district president Sanjay Khokhar shot dead by unidentified men in Chhaprauli area, earlier today.
— ANI UP (@ANINewsUP) August 11, 2020