BREAKING NEWS : స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురి అరెస్టు

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు..

BREAKING NEWS : స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురి అరెస్టు
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 10, 2020 | 6:52 PM

Three Arrested in Swarna Palace Fire : విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాల్‌రావుతో పాటు.. జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ వెంకటేష్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

హోటల్‌ నిర్వాహకులతో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. నిందితుల నుంచి మరింత సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు.