కురిచేడు శానిటైజర్‌ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

కురిచేడు శానిటైజర్‌ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తుండగా

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 11:59 AM

kurichedu sanitizer case updates: ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తుండగా.. ఇందులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు హైదరాబాద్‌లో తయారు చేసిన ‘పర్‌ఫెక్ట్‌’ సొల్యూషన్స్ కారణమని సిట్ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వీరు నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్నట్టు తేల్చారు. యూట్యూబ్‌లో చూసి శానిటైజర్‌ తయారు చేసినట్టుగా నిందితుడు అమీర్ తెలిపాడు.

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో వీటిని తయారుచేస్తూ స్థానికంగా ఉన్న షాప్‌లలో విక్రయిస్తున్నామని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని అమీర్ వెల్లడించాడు. ఇక ఈ శానిటైజర్‌లలో నిషేధిత మిథైల్‌ క్లోరైడ్ వాడినట్టుగా అతడు అధికారులకు తెలిపాడు. దీంతో ఏపీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సిట్ అధికారులు అమీర్‌ని చేర్చారు.  ఇక ఇతడికి మిథైల్‌ క్లోరైడ్‌ని ఎవరు సరఫరా చేస్తున్నారు..? ఎక్కడి నుంచి వచ్చింది..? అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మిథైల్‌ క్లోరైడ్ సరఫరా చేసే వారిపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు, శానిటైజర్ నిర్వాహకుడు సాలె శ్రీనివాస్‌ను సైతం అన్ని కోణాల్లో కూపి లాగారు. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆదాయంపై ఆకర్షితుడై‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి శానిటైజర్‌ తయారు చేసి ఆ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెట్టిన పదిరోజులల్లో బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్‌ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్‌ రోడ్డులో పర్‌ఫెక్ట్‌ కెమికల్స్‌ అండ్‌ సాల్వెంట్స్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడ తయారు చేసిన శానిటైజర్‌ని తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను నియమించుకున్నాడు. అయితే పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్‌ ఆల్కాహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి విక్రయించాడు. అదే పరిస్థితుల్లో శ్రీనివాస్ కరోనా బారిన పడటంతో, ఆ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో శ్రీనివాస్ తలదాచుకోగా.. అతడి ఆచూకీని తెలుసుకున్న సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

Read This Story Also: రియాకు మద్దతిచ్చిన స్వర భాస్కర్‌.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu