Crime News: విషాదం.. మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి.. ఆడుకుంటుండగా..
Boy dies of electric shock: గణేష్ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాద
Boy dies of electric shock: గణేష్ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. విద్యుత్ షాక్‌తో ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్‌లో సోమవారం జరిగింది. జీడిమెట్ల షాపూర్ నగర్ సమీపంలోని ఎన్ఎల్బీ నగర్లో మల్లేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తన వద్దే బావమరిది కుమారుడు ఐదేళ్ల అనిల్ అలియాస్ అభి సైతం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సంతోషి మాత ఆలయంలో ప్రతిష్టించిన గణేష్ మండపం వద్ద అభి ఆడుకుంటున్నాడు. అయితే గణేష్ మండపం కోసం వేసిన సీరియల్ లైట్స్ వైర్ తెగి పడి ఉన్నాడు. అయితే.. అది తెలియక అభి కరెంటు వైర్‌ను పట్టుకున్నాడు. దీంతో కరెంటు షాక్ కొట్టడంతో అభి అక్కడికక్కడే సృహ కోల్పోయి పడిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాలుడిని స్థానిక మెడ్విజన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కరెంటు వైర్లు ఓపెన్‌గా పెట్టి నిర్లక్ష్యం వహించిన గణేష్ మండపం నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాలుడి బంధువులు కోరుతున్నారు. కాగా.. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: