AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prajavani: కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు..! కృష్ణాజిల్లా ప్రజావాణిలో కలకలం

జిల్లా కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారప్పొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో

Prajavani: కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు..! కృష్ణాజిల్లా ప్రజావాణిలో కలకలం
Venkata Narayana
|

Updated on: Sep 13, 2021 | 4:18 PM

Share

Machilipatnam – Prajavani: జిల్లా కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారప్పొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో చూసిన పోలీసులు వాటన్నింటినీ లాక్కుని.. అతన్ని స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఈ సీన్‌ కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కి అర్జీ ఇవ్వడానికి జెంటిల్‌ మేన్ లా వచ్చాడు కొల్లు అశోక్‌ అనే వ్యక్తి. తనకున్న స్థల వివాదం పరిష్కరించాలని కోరాడు. ప్రాణరక్షణ కూడా కావాలని వేడుకున్నాడు. అంటూ అంటూనే.. తుపాకీ, కత్తి, కారప్పొడి బయటకు తీశాడు.

Collec 6

వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు ఉన్న పళంగా వాటిని లాక్కుని.. అతన్ని చిలకలపూడి స్టేషన్‌కు తరలించారు. అయితే అశోక్ తీసుకొచ్చిన తుపాకీ నకిలీ దని తేల్చారు. కానీ అర్జీ కోసం, వివాద పరిష్కారం కోసం, ప్రాణ రక్షణ కోసం వేడుకోడానికి వచ్చిన వ్యక్తికి వీటితో పనేంటని, అసలు ఏ టార్గెట్‌తో వచ్చాడన్న అంశాలపై పోలీసులు అశోక్‌ ఇంటరాగేట్ చేస్తున్నారు.

Collector

డమ్మీ గన్, కత్తి, కారంతో వచ్చిన సదరు అర్జీదారుడు తిరువూరుకు చెందిన కె అశోక్‌ అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అతని నుండి డమ్మీ గన్, కత్తి, కారం పొట్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనపై మీడియాకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు వెనుకాడుతున్నట్టు సమాచారం.

Collector 2

Read also:  Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...