AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు!

కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు!
Building Collapses In Delhi
Balaraju Goud
|

Updated on: Sep 13, 2021 | 3:28 PM

Share

కుండపోత వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో సబ్జీ మండీ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సోమవవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు శిధిలాల కింద చిక్కుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని భారీగా సహాయక చర్యలను ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం కూలినప్పుడు లోపల కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు.

ఒక వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీసి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఎనిమిది అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయనీ, స్థానిక పోలీసులు, ఎంసీడీ, ఎన్‌డీఆర్ఎఫ్ తదితరులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సెంట్రల్ రంగే జాయింట్ సీపీ ఎన్.ఎస్.బుడేలా తెలిపారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అంచనా వేయడానికి సమయం పడుతుందని, ఇంతవరకూ ఒకరిని కాపాడామని, తలకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు.

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ఎనిమిది ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి తరలించామని తెలిపారు. ఇరుకైన దారుల కారణంగా భారీ యంత్రాలను అక్కడికి చేరుకోవడంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు పిల్లలు చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. సహాయక చర్యలు మానవీయంగా జరుగుతున్నాయి.

కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అధికారులను అప్రమత్తం చేసిన శిథిలాలను తొలగించిన క్షతగాత్రులను ఆసుపత్రి తరలించాలని సీఎం ఆదేశించారు. Read Also… Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..