Kidnap and Rape: రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక కిడ్నాప్.. ఆపై రైల్వే క్వార్టర్స్‌లోకి లాక్కెళ్లి..
Maharashtra: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మృగాళ్లలో మాత్రం భయం, మార్పు రావడం లేదు.
Maharashtra: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మృగాళ్లలో మాత్రం భయం, మార్పు రావడం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ మైనర్ బాలికపై కామాంధుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం రాత్రి ఉల్లాస్ నగర్ రైల్వే స్టేషన్‌లో ఓ మైనర్ బాలిక తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కైవాక్‌పై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. ఓ వ్యక్తి(34) సుత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో బాలిక పక్కన ఉన్న స్నేహితులు పారిపోగా.. ఆ బాలికను మాత్రం బంధించాడు నిందితుడు. రైల్వే క్వార్టర్స్‌లోని ఓ ఒంటరి గదిలోకి ఈడ్చుకెళ్లాడు. ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రంతా తన చెరలోనే ఉంచుకున్న నిందితుడు.. ఉదయం వదిలి పెట్టాడు. అయితే, కీచకుడి చెర నుంచి బయటపడి ఇంటికి చేరిన బాధిత బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఆ తరువాత బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాస్‌నగర్‌లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే, అక్కడి పోలీసులు చట్టపరమైన సమస్యలను కారణంగా చూపుతూ విఠల్వాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దాంతో బాధితులు.. విఠల్‌వాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ, అక్కడా వారికి అదే పరిస్థితి ఎదురైంది. కళ్యాణ్ జీఆర్‌పీ కి వెళ్లాల్సిందిగా సూచించారు. ఇక చేసేదేమీ లేక.. వారు సాయంత్రానికి కళ్యాణ్ జీఆర్‌పీకి చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయాన్ని వివరిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి సాయంత్రానికి అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు పోలీసులు. నిందితుడి దాడిలో గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, మహారాష్ట్రలోని నిర్మానుష్యమైన రైల్వే క్వార్టర్స్ పరిధిలో.. మూడు నెలల వ్యవధిలో అత్యాచారం జరుగడం ఇది రెండోసారి. జులై నెలలో కళ్యాణ్ లోని రైల్వే క్వార్టర్స్‌లో 27 ఏళ్ల మూగ, చెవిటి మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఉల్లాస్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో అత్యాచారం చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలాఉంటే ఇటీవలె మహారాష్ట్రలోని పూణేలో 13 ఏళ్ల బాలికను రైల్వే స్టేషన్ నుండి కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కాగా.. మరో ఐదుగురు ఆటో డ్రైవర్లు. ఈ ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తీవ్ర భయబ్రాంతులకు గురైన బాధిత బాలిక ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.
Also read:
Nagarkurnool: ఫుల్‌గా మద్యం తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ ఓవరాక్షన్!