Nagarkurnool: ఫుల్‌గా మద్యం తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ ఓవరాక్షన్!

నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఆదివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ఎర్రగడ్డ కాలనీలో వినాయక మండపం వద్ద సబ్ జైలు కానిస్టేబుల్‌గా...

Nagarkurnool:  ఫుల్‌గా మద్యం తాగేసి గణేశ్ మండపం వద్ద కానిస్టేబుల్ ఓవరాక్షన్!
Conistable

నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఆదివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ఎర్రగడ్డ కాలనీలో వినాయక మండపం వద్ద సబ్ జైలు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు లిక్కర్ సేవించి హల్‌చల్‌ చేశారు. గణేశ్ మండపం నిర్వాహకులను అసభ్య పదజాలంతో దూషించారని పలువురు యువకులు ఆరోపించారు. తాము 100కు డయల్‌ చేసినా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదని బాధితులు వాపోయారు.  సార్ అనవసరంగా తిట్టొద్దు అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడుతుండగా పట్టించుకోకుండా నోటికి చెప్పరాని పదాలతో దూషిస్తూ రెచ్చిపోయారని యువకులు ఆరోపించారు. ఈ గొడవని ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాధిత యువకుడు ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు.

బైక్​లో అకస్మాత్తుగా మంటలు.. మహిళా కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు

బైక్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ మహిళా కానిస్టేబుల్​ తీవ్రంగా గాయపడింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ పీఎస్​లో డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఇంటికి వెళ్లే దారిలో మల్కాజిగిరిలోని మౌలాలి ఫ్లై ఓవర్​ బ్రిడ్జ్​పైకి రాగానే బైక్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. వెంటనే అలర్టైన మహిళా కానిస్టేబుల్ తప్పించుకునే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Also Read: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్… ప్రకాశ్ రాజ్ కంటతడి

రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

Click on your DTH Provider to Add TV9 Telugu