Telangana High Court: గణేషుడి నిమజ్జనానికి అనుమతివ్వండి.. హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్..

Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు.

Telangana High Court: గణేషుడి నిమజ్జనానికి అనుమతివ్వండి.. హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్..
Ts High Court
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 13, 2021 | 11:26 AM

Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉన్నపళంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నగర వ్యాప్తంగా నెలకొల్పిన గణేషుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. ఎప్పటిలాగే.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయగా.. హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అవసరం పేర్కొంది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవు జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో కోర్టుకు వివరించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్న జీహెచ్ఎంసీ.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేసామంది. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించింది. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని, నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హైకోర్టు ధర్మాసనానికి జీహెచ్ఎంసీ వివరించింది. కరోనా కట్టడికి మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాలు ఆపితే వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాలంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపును కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గణేషుడి నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన నాలుగు అంశాలను తొలగించాలని జీహెచ్ఎంసీ కోరింది. ఆ నాలుగు అంశాలు ఇవే.. * హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరిన జీహెచ్ఎంసీ. * ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరిన జీహెచ్ఎంసీ. * సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని జీహెచ్ఎంసీ వినతి. * హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరిన జీహెచ్ఎంసీ.

Als0 read:

Ram Charan: ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ముల’లవ్ స్టోరీ’ ట్రైలర్..

Horse Grams: ఒకప్పుడు పేదవాడి గుగ్గుళ్ళు ఉలవలు.. నేడు ఖరీదైన ఆహారం.. స్టేటస్ సింబల్.. ఉలవలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?