AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 3 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టిన వ్యక్తి.. నేడు అప్పడాలు అమ్ముకుంటున్నాడు

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు.. ప్రతి ఒక్కరినీ కట్టిపడేసే కళా నైపుణ్యం.. ఇదంతా ఒకప్పుడు.. నేడు ఆ కళాకారుడి జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. బతుకే దుర్భరంగా మారింది.

Telangana: 3 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టిన వ్యక్తి.. నేడు అప్పడాలు అమ్ముకుంటున్నాడు
Avula Kishan 1
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2021 | 9:46 AM

Share

పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్.. కాదు కాదు కత్తుల కిషన్ కళానైపుణ్యం ఎల్లలు దాటింది. 2011లో మూడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పోటీల్లో సైతం పాల్గొన్నాడు. 23 కత్తులు గొంతులో పెట్టుకొని ఇటలీ రోమ్ నగరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు దేశ, విదేశాల్లో కూడా తన ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కానీ కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ప్రదర్శనల్లేక స్వగ్రామం చిన్నకల్వలకు వచ్చేశాడు. కిషన్‌కు ఓ తల్లి, భార్య, ఐదుగురు కూతుళ్లు. వాళ్ల పెళ్లిళ్లు చేయడానికి పదిహేను లక్షల అప్పు చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గతంలో పక్క ఊరిలో ఓ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అది కూడా నడవక అప్పులపాలయ్యాడు. పూట గడవడం కష్టంగా మారడంతో మెషీన్ పనికి వెళ్లాడు. ఓ రోజు యాక్సిడెంట్ జరగడంతో ట్రీట్మెంట్ కోసం మరో రెండు లక్షలు అప్పు చేశాడు. ప్రస్తుతం ఇప్పుడు అతడు కొద్దిగా కోలుకున్నాడు. తన కుటుంబాన్ని పస్తులుంచలేక ఓ మైక్ పట్టుకొని మోపెడ్ మీద అప్పడాలు అమ్ముతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. మూడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టి రాష్ట్రం పేరు, ప్రఖ్యాతిని నిలిపిన కిషన్ కుటుంబానికి పూట గడవడమే కష్టతరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోకపోతే చావే శరణ్యమంటున్నారు కిషన్ కుటుంబసభ్యులు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Avula Kishan

Also Read:  స్మశానవాటికలో అస్థిపంజరంతో నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...