AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Chana: నాన్ వెజ్ అలవాటు లేనివారికి ఉడికించిన శనగలు ఒక వరం.. రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Soaked Chana Health Benefits: ప్రస్తుతం మనిషి జీవితం కాలంతో పరుగులు పెడుతూ సాగుతుంది.  సమయానికి తినని తిండి.. సమయానికి పడుకొని నిద్ర.. ఇక పగలు రాత్రి అనే బేధం లేని పని... అసలు పగలు పని చేసి..

Soaked Chana: నాన్ వెజ్ అలవాటు లేనివారికి ఉడికించిన శనగలు ఒక వరం.. రోజూ తింటే ఎన్ని  ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Soaked Chana
Surya Kala
|

Updated on: Sep 13, 2021 | 9:40 AM

Share

Soaked Chana Health Benefits: ప్రస్తుతం మనిషి జీవితం కాలంతో పరుగులు పెడుతూ సాగుతుంది.  సమయానికి తినని తిండి.. సమయానికి పడుకొని నిద్ర.. ఇక పగలు రాత్రి అనే బేధం లేని పని… అసలు పగలు పని చేసి.. రాత్రి నిద్రపోవాలి అనే నియమం మార్చేస్తున్న ఉద్యోగాలు.. దీనికి తోడు.. తినే తిండి రసాయనాల మయం.. దీంతో ఆడ మగ , చిన్న పెద్ద అనే బేధం లేకుండా వ్యాధుల పాలవుతున్నారు. మనం తినే తిండిలో చిన్న పాటి మార్పులు చేసుకొంటే చాలు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మాంసాహారం అలవాటు లేనివారికి దివ్య ఔషధం ఉడికించిన శనగలు అంటున్నారు. అవును ఈ ఉడికించిన శనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయట.అయితే శనగలను పొట్టు తీయకుండా తింటేనే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. కనుక వీలయితే రోజూ స్నాక్స్క గానో.. టిఫిన్ గానో ఉడకబెట్టిన శనగలు తినమని సూచిస్తున్నారు. ఈరోజు ఉడికించిన శనగలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

*మాంసాహారం అలవాటు లేనివారికి శనగలు ఒక వరం.. ఎందుకంటే వీటిల్లో మాంసంలో ఉంటె ప్రోటీన్లు ఉంటాయి. *రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. దీంతో రక్తహీనత సమస్య నివారింపబడుతుంది *రోగనిరోధక శక్తిని పెంచుతాయి. *పాలల్లో ఉండే కాలిష్యంకు ఉడకబెట్టిన శనగలు దాదాపు సమానమైనవి. వీటిల్లో ఎముకలను ధృడంగా చేసే గుణం ఉంది. *దురద, గజ్జి వంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. *శనగల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. *గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. *శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. *ఇక శనగలు తినటం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో  ఆకలి త్వరగా వేయదు. అందువల్ల శనగలను తింటే బరువు కూడా తగ్గవచ్చు. *శనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి పోషకాలు ఉన్నాయి. దీంతో నిద్ర బాగా పట్టటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇక శనగలను ఉడకబెట్టుకునే కాదు.. నానబెట్టుకుని శనగలను మొలకలు చేసుకుని తిన్నా మంచి ప్రయోజనం కలుగుతుంది. బాదం పప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అన్ని ప్రయోజనాలు ఉడికించిన శనగల్లో ఉంటాయి.

Also Read: Payyavula Keshav: పొలం బాట పట్టిన ఎమ్మెల్యే.. రైతుగా మారి వేరుశనగ తోటలో కలుపు తీసిన టీడీపీ నేత..