Healthy Liver Tips: ఇలాంటి పానీయాలు తీసుకుంటే.. లివర్‌ సమస్యలు మటుమాయం.. ఫిట్‌గా కూడా ఉండవచ్చు..

Liver Care Tips: మన శరీరంలోని ముఖ్యమైన అవయావల్లో కాలేయం కూడా ఒకటి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే.. మనం ఆరోగ్య వంతంగా

Healthy Liver Tips: ఇలాంటి పానీయాలు తీసుకుంటే.. లివర్‌ సమస్యలు మటుమాయం.. ఫిట్‌గా కూడా ఉండవచ్చు..
Healthy Liver Tips
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Sep 13, 2021 | 8:43 AM

Liver Care Tips: మన శరీరంలోని ముఖ్యమైన అవయావల్లో కాలేయం కూడా ఒకటి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే.. మనం ఆరోగ్య వంతంగా ఉంటామని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేసి గ్లూకోస్ తయారుచేయడానికి కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే జీవన శైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే.. మేలని పేర్కొంటున్నారు. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలు.. సక్రమంగా జీర్ణమై ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటామని పేర్కొంటున్నారు. అయితే.. అలాంటి కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. కాలేయం పనితీరును సహజసిద్దంగానూ మెరుగుపర్చవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. తద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. కాలేయం పనితీరు మెరుగు పడాలంటే.. మీ ఆహారంలో ఇలాంటి పానీయాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పుదీనా టీ.. పుదీనా ఆకులు పలు సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని మెంతాల్‌ లక్షణాలు డిటాక్స్‌ చేయడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించి.. తాగితే మంచిది. రాత్రి పడుకునే ముందు తాగితే ఇంకా మేలని పేర్కొంటున్నారు.

పసుపు టీ.. పసుపులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది యాంటిబయోటిక్‌లా పనిచేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడానికి దివ్య ఔషధంలా పనిచేస్తూ. రోజూ పసుపు టీ తాగితే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అల్లం, నిమ్మ టీ.. నిమ్మ నీటిలో అల్లం కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా బరువు తగ్గిస్తుంది. దీంతోపాటు జీవక్రియను మెరుగు పర్చి కాలేయ వ్యాధులను అరికడుతుంది.

మెంతి టీ.. మెంతి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతి నీటిని పడుకునే ముందు తాగాలి. ఒక గ్లాసు వేడినీటిలో ఒక టీస్పూన్ మెంతిపొడి వేసి తాగితే మంచిది.

చామంతి టీ.. చమోమిలే టీ (చామంతి టీ) ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. మరిగే నీటిలో 1 స్పూన్ చమోమిలే వేసి తాగితే చాలా మంచిది.

దాల్చిన చెక్క టీ.. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి పేగులు, కాలేయాన్ని శుభ్రపరచడంతోపాటు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Also Read:

Corona Vaccine: టీకాలు తీసుకున్నా 20 శాతం మందిలో యాంటీ బాడీలు లేవు.. బూస్టర్ డోస్ తప్పనిసరి కానుందా?

Ground Nut: వేరుశెనగతో ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.. రోజూ గుప్పెడు వేరుశెనగలు తినేయండి!