Viral Video: ఓ అమ్మాయి పాట వింటుంటే అక్కడే ఉన్న గుర్రం చూడండి ఏం చేస్తుందో.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..
Viral Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు మనకు దర్శమిస్తుంటాయి. కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
Viral Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు మనకు దర్శమిస్తుంటాయి. కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇక ప్రకృతికి, జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట లెక్కలేనన్ని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎమోషన్స్ అనేవి జంతువుల్లో మనకాన్నే రెట్టింపే ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి తమ ఫీలింగ్స్ ను బయటపెడుతుంటాయి. ఇందుకు ఉదాహరణగా చాలా వీడియోలో ఉన్నాయి. జంతువులు కూడా మనలనే ప్రేమిస్తాయి.. భాదపడతాయి.. ఏడుస్తాయి.. నవ్వుతాయి. ఇక జంతువులు కూడా సంగీతానికి స్పందిస్తాయి. సంగీతానికి అనుగుణంగా జంతువులు డాన్స్‌లు చేయడం.. మ్యూజిక్‌ను ఫీల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియో కూడా అలాంటిదే.. సంగీతానికి జంతువులు స్పందిస్తాయి అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.
ఇక్కడ ఓ అమ్మాయి మ్యూజిక్ వింటూ పాటను ఎంజాయ్ చేస్తుంది. ఆ సమయంలో తన తలను ఆ మ్యూజిక్‌కు అనుగుణంగా ఆడిస్తుండగా.. అక్కడికి వచ్చిన ఓ గుర్రం కూడా ఆపాటకు తలను ఆడిస్తూ పాటను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎంతో అందంగా ఉంది అని కొందరు.. మనసుకు హాయిగా అనిపించిందని మరికొంతమంది.. ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :