- Telugu News Photo Gallery World photos Know the interesting facts about china gypsies of sea village where people will live on floting boat
విచిత్రం కదూ.. నీటిపై తెలియాడుతున్న ఇళ్లు.. అందులోనే జనాలు.. ఎన్నో రహస్యాలున్న గ్రామం ఎక్కడుందో తెలుసా..
సాధారణంగా ఒక గ్రామంలోని ఇళ్లు భూమిపై ఉండడం గురించి మాత్రమే మనకు తెలుసు. ఇటీవల మేఘాల పై కొండపై ఉన్న గ్రామం గురించి కూడా విన్నాం. అయితే నీళ్లపై ఉన్న గ్రామం గురించి తెలుసా.. అక్కడి ఇళ్లన్ని నీటిపై తెలియాడుతూ ఉంటాయి. ఆ మర్మమైన గ్రామం గురించి తెలుసుకుందామా.
Updated on: Sep 13, 2021 | 12:47 PM

24 గంటలు నీటిలో తెలియాడే గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా ? ఈ ఊరు చైనాలోని నింగ్ డే నగరంలో ఉండే గ్రామం ఎప్పుడు నీటిపై తెలియాడుతూనే ఉంటుంది.

ఈ గ్రామాన్ని జిప్సీ ఆఫ్ ది సీ అంటారు. ఇక్కడ ఎక్కువగా మత్య్సకారులు మాత్రమే నివసిస్తుంటారు. ఇక్కడి ఇళ్లు మొత్తం చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ఇళ్ల కింద బలమైన చెక్క ప్లాట్ ఫారమ్స్ ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి.

ఇక్కడ నివసించే వారంతా.. వారి పాలకుల వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వారి కుటుంబాన్ని పోషించడానికి ఇక్కడున్న వారంతా పడవలను నడుపుతూ.. చేపలను విక్రయిస్తూ జీవిస్తుంటారు.

ఈగ్రామం సరిగ్గా హాలీవుడ్ సినిమా ది హాబిట్.. బాటిల్ ఆఫ్ ఫైవ్ ఆర్మీ వంటిదే. జిప్సీ ఆఫ్ ది సీలో కూడా ఇదే తరహా ఇళ్లు ఉంటాయి.

ఇటీవల ఇక్కడి గ్రామస్తులు స్థానిక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా అందుకున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఇళ్లు కూడా నిర్మిస్తోంది. కానీ చాలా వరకు సముద్రంలో ఉన్న చెక్క ఇళ్లలో నివసించడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు.





























