Hyderabad: ఇల్లు వదిలి వెళ్లిపో.. లేకపోతే రేప్ చేయిస్తా.. కుమార్తెకు కిరాతక తండ్రి బెదిరింపులు.. 

Hyderabad Crime News: ఓ తండ్రి.. కన్న బిడ్డతో దారుణంగా ప్రవర్తించాడు. ఇల్లు వదిలి వెళ్లాలి.. లేదంటే అత్యాచారం చేయిస్తానంటూ కన్న కూతురిని బెదిరించాడు. దీంతో ఆ కూతురు

Hyderabad: ఇల్లు వదిలి వెళ్లిపో.. లేకపోతే రేప్ చేయిస్తా.. కుమార్తెకు కిరాతక తండ్రి బెదిరింపులు.. 
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2021 | 1:03 PM

Hyderabad Crime News: ఓ తండ్రి.. కన్న బిడ్డతో దారుణంగా ప్రవర్తించాడు. ఇల్లు వదిలి వెళ్లాలి.. లేదంటే అత్యాచారం చేయిస్తానంటూ కన్న కూతురిని బెదిరించాడు. దీంతో ఆ కూతురు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిరాతక తండ్రిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 10లో ఓ ఎంఫిల్‌ విద్యార్థిని తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి ఓ ఇంట్లో నివసిస్తోంది. తండ్రి వేరుగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి.. ఇల్లు వదిలి వెళ్లాలంటూ కొంత కాలంగా ఆమెతో పాటు తల్లిని బెదిరిస్తున్నాడు.

శనివారం ఇంట్లోకి వచ్చిన తండ్రి.. ఇల్లు వదిలివెళ్లాలంటూ భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడ్డాడు. లేకపోతే.. అత్యాచారం చేయిస్తానని.. ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలు చేసుకోవడంతో పాటు తమపై దాడికి దిగుతున్నాడని, ఇదేమని ప్రశ్నించినందుకు అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.

Also Read:

Ramya Murder Case: దిశ కేసుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. 58 రోజల్లో శిక్ష పడేలా చూస్తాం.. హోంమంత్రి సుచరిత

Crime News: ఛీ.. ఛీ.. ఇలాంటి మహిళలు ఉంటారా..? యూపీలో దారుణ ఘటన..