Ramya Murder Case: దిశ కేసుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. 58 రోజల్లో శిక్ష పడేలా చూస్తాం.. హోంమంత్రి సుచరిత

Mekathoti Sucharita comments: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య అనంతరం నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై విపక్షాలన్ని

Ramya Murder Case: దిశ కేసుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. 58 రోజల్లో శిక్ష పడేలా చూస్తాం.. హోంమంత్రి సుచరిత
Ramya Death
Follow us

|

Updated on: Aug 16, 2021 | 11:21 AM

Mekathoti Sucharita comments: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య అనంతరం నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై విపక్షాలన్ని ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి సుచరిత కీలక ప్రకటన చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసి హంతకుడికి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. దిశ చట్టం వచ్చిన తర్వాత 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతుందని హోంమంత్రి పేర్కొ్న్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లను తొందరగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటికోసం సీఎం నిధులు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే.. తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నామని హోంమంత్రి తెలిపారు. నిందితులను పట్టుకోవటం కష్టమైనప్పటికీ.. ఒకరిని పట్టుకున్నామని హోమంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారని తెలిపారు.

ఈ ఘటనల్లో ఒక్క నిందితుడు కూడా తప్పుకోవటానికి వీలు లేదని సీఎం పోలీసులకు ఆదేశాలిచ్చారన్నారు. పార్లమెంట్‌లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయంటూ హోంమంత్రి సుచరిత వెల్లడించారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే గుంటూరు కాకాని ఘటనలో నిందితుడని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అందరూ వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్లకూడదని భావించాలని వ్యాఖ్యానించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ లైవ్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

పూర్తయిన పోస్టుమార్టం.. టీడీపీ ఆందోళన.. 

కాగా.. రమ్య మృతదేహానికి పోస్టు మార్టమ్ పూర్తయింది. సోమవారం ఉందయం అధికారులు రమ్య మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సొంత ఊరికి మృతదేహాన్ని తరలిస్తున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహం తరలిస్తున్న వాహానాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్యర్యంలో ఆందోళన ఇంకా కొనసాగుతోంది.

Also Read:

Crime News: ఛీ.. ఛీ.. ఇలాంటి మహిళలు ఉంటారా..? యూపీలో దారుణ ఘటన..

AP Crime News: కసాయి భర్త.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్