Couple Suicide: సుప్రీంకోర్టు ప్రధాన ద్వారం వద్ద కలకలం.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం!
దేశ రాజధాని ఢిల్లీలో ఓ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టించింది. ఒక మహిళ, ఒక వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన గేటు వద్ద నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టించింది. ఒక మహిళ, ఒక వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన గేటు బయట తమకు తాము నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ హఠాత్తు పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. హుటాహుటీన వారిద్దరినీ చికిత్స నమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన ద్వారం గేట్ నంబర్ D ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ, వారి వద్ద సరియైన ధృవపత్రతాలు లేకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఇద్దరికి వేగంగా మంటలు అంటుకోవడంతో భద్రతా సిబ్బందించి.. మంటలార్పి, పోలీస్ వ్యాన్ ద్వారా వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.