రెడ్‌మీ ఫోన్లు కొంటున్నారా.? జర భద్రం గురూ.. హెచ్చరిస్తున్న పోలీసులు.!

ఈ మధ్యకాలంలో మనం కొనుగోలు చేసే ప్రతీ వస్తువు నకిలీ అవుతోంది. సబ్బు దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు అన్నీ కూడా నకిలీవి సృష్టిస్తున్నారు కేటుగాళ్ళు.

రెడ్‌మీ ఫోన్లు కొంటున్నారా.? జర భద్రం గురూ.. హెచ్చరిస్తున్న పోలీసులు.!
Follow us

|

Updated on: Nov 25, 2020 | 9:15 PM

Fake Redmi Phones: ఈ మధ్యకాలంలో మనం కొనుగోలు చేసే ప్రతీ వస్తువు నకిలీ అవుతోంది. సబ్బు దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు అన్నీ కూడా నకిలీవి సృష్టిస్తున్నారు కేటుగాళ్ళు. ఇక తాజాగా నకిలీ రెడ్‌మీ ఫోన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కేటుగాళ్ళు చెన్నై, బెంగళూరులో విక్రయిస్తున్న 3 వేల నకిలీ రెడ్‌మీ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ. 33.3 లక్షలు ఉంటుందని తెలిపారు. ఫోన్లతో పాటు హెడ్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లను కూడా వివిధ షాపుల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా, నకిలీ రెడ్‌మీ మొబైళ్లు మార్కెట్‌లో చలామణీ అవుతున్నాయని.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!