‘వేలిముద్రల ఆపరేషన్’.. క్రైమ్ రేట్‌లో నయా దందా!

'వేలిముద్రల ఆపరేషన్'.. క్రైమ్ రేట్‌లో నయా దందా!
West Godavari Police bust fake passport racket in Eluru

అబ్బబ్బ..క్రైమ్ చెయ్యడానికి జనాలు ఓ రేంజ్‌లో తెలివిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే క్రైమ్ వింటే ప్రతి వ్యక్తి షాక్‌కి గురవ్వాల్సిందే. ఇదే ఇంటిలిజెన్స్ బాగుపడటానికి ఉపయోగిస్తే బాగుండు.  ఇన్నాళ్లు వేలిముద్రల ఆధారంగా పోలీసులు నేరస్థులను పట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పింగర్ ప్రింట్స్‌ని కూడా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ ఘటన చూశాక అసలు ఇలా కూడా క్రైమ్ చేయవచ్చా? అని విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది. డబ్బు కోసం ఏకంగా చేతి వేళ్లపై ముద్రలనే తారుమారు చేస్తున్న […]

Ram Naramaneni

|

Sep 07, 2019 | 1:17 PM

అబ్బబ్బ..క్రైమ్ చెయ్యడానికి జనాలు ఓ రేంజ్‌లో తెలివిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే క్రైమ్ వింటే ప్రతి వ్యక్తి షాక్‌కి గురవ్వాల్సిందే. ఇదే ఇంటిలిజెన్స్ బాగుపడటానికి ఉపయోగిస్తే బాగుండు.  ఇన్నాళ్లు వేలిముద్రల ఆధారంగా పోలీసులు నేరస్థులను పట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పింగర్ ప్రింట్స్‌ని కూడా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ ఘటన చూశాక అసలు ఇలా కూడా క్రైమ్ చేయవచ్చా? అని విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది. డబ్బు కోసం ఏకంగా చేతి వేళ్లపై ముద్రలనే తారుమారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చేతివేళ్లకు గాయాలు చేసి, అవి మానిన తర్వాత ఏర్పడిన కొత్త వేలి ముద్రలతో తిరిగి ఆధార్‌, పాస్‌పోర్ట్‌లు సంపాదించి అక్రమాలకు పాల్పడుతున్నారు.

అంతర్జాతీయ వ్యవస్థలను సైతం బోల్తా కొట్టించి.. నకిలీ వేలిముద్రల సహాయంతో కొత్త క్రైమ్‌కి తెరతీసిన మాయగాళ్ల ఆటని పోలీసులు కట్టించారు. చేతి వేళ్లపై ఉన్న చర్మాన్ని లోతుగా కోయడం, సర్జరీ చెయ్యడం, కొత్త వేలిముద్రలు సృష్టించడం..వాటి సహాయంతో నకిలీ ఆధార్, పాస్‌పోర్ట్ పొంది విదేశాలకు ఎగిరిపోవడం ఈ ముఠా స్టైల్. ఇదే తరహాలో దాదాపు 70 మందిని విదేశాలకు పంపించింది ఈ క్రైమ్ ముఠా. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్వాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశంలోని వివిధ స్టేట్స్‌కు తమ పరిధిని విస్తరించుకున్నారు ఈ కేటుగాళ్లు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం బుగ్గేశ్వరానికి చెందిన రాంబాబు 2012లో కువైట్‌ వెళ్లాడు. అక్కడ సారా వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోగా.. అతడిని భారత్‌కు తిప్పి పంపారు. ఆ సమయంలో రాంబాబు వేలి ముద్రలు నమోదు చేసుకొని… ఆ దేశానికి తిరిగి రాకుండా నిషేధం విధించారు. కువైట్‌లో ఉండగానే రాంబాబుకు పరిచయమైన మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, ముజఫర్‌ సహకారంతో వేలి ముద్రలు తారుమారు చేసి బండి రాజేష్‌ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ పొందాడు. తిరిగి సునాయాసంగా కువైట్‌ వెళ్లి… ఆ ముగ్గురితో ముఠాగా ఏర్పడి… నకిలీ వేలిముద్రల సృష్టినే వ్యాపారంగా మార్చుకున్నాడు.

నకిలీ వేలిముద్రల తయారీలో భాగంగా… ముందుగా చేతివేళ్లపై అడ్డంగా, నిలువుగా కోతలు పెట్టి  కుట్లు వేస్తారు. 2 నెలల తర్వాత గాయాలు మాని పాతవాటి స్థానంలో గాయాల వలన  కొత్తవి ఏర్పడతాయి. ఆ తర్వాత నకిలీ పేర్లు, వివరాలతో సునాయాసంగా ఆధార్‌, పాస్‌పోర్ట్‌ పొందేవారు. ఇలా చేసినందుకు ఒక్కొక్కరి వద్ద 5లక్షల రూపాయలు సమర్పించుకోవాలి. అయితే దొడ్డిదారిన అక్కడికి వెళ్లినవారు..ఆయా దేశాల్లో ఏమైనా క్రైమ్‌కి పాల్పడుతున్నారా? అసలు ఏయే కంట్రీస్‌కి ఇక్కడనుంచి వెళ్లారు. వీరికి డైరక్షన్స్ ఇస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఠా సభ్యులైన బొక్కా రాంబాబు, ఆర్‌ఎంపీ వైద్యుడు వీరా త్రిమూర్తులు, కోడెంరెడ్డి రాజిరెడ్డి, షేక్ మహ్మద్ సహా శ్రీలంకకు చెందిన జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. రాంబాబు ఈ ముఠా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu