Eluru Murder Case: గంజి ప్రసాద్‌ హత్యకేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేపై కుటుంబసభ్యుల సంచలన ఆరోపణలు!

ఏలూరు జి. కొత్తపల్లి గంజి ప్రసాద్‌ హత్య దుమారం రేపుతోంది. స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జి.కొత్తపల్లిలో 2వారాల పాటు 144సెక్షన్‌ విధించారు పోలీసులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

Eluru Murder Case: గంజి ప్రసాద్‌ హత్యకేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేపై కుటుంబసభ్యుల సంచలన ఆరోపణలు!
Eluru Ysrcp Leader Ganji Prasad
Follow us

|

Updated on: May 01, 2022 | 11:32 AM

Eluru Ganji Prasad Murder Case: ఏలూరు జి. కొత్తపల్లి గంజి ప్రసాద్‌ హత్య దుమారం రేపుతోంది. స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జి.కొత్తపల్లిలో 2వారాల పాటు 144సెక్షన్‌ విధించారు పోలీసులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ గంజి ప్రసాద్ డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైసీపీ నేత గంజి ప్రసాద్‌ హత్య కేసులో అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటిదాకా పదిమందిపై కేసు నమోదు చేశారు. 20-B, 302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వర్గ విభేదాలే హత్యకు దారితీశాయా? ఇంకేవైనా కారాణాలున్నాయా? అసలు గంజి ప్రసాద్‌తో ఎంపిటీసీ బజారయ్యకు ఉన్న వివాదాలేంటి అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ కేసులో సురేష్‌, మోహన్‌, హేమంత్‌, నాగార్జున, బజారయ్య, రెడ్డి సత్యనారాయణ, భాను ప్రకాష్‌, రవితేజ, జనార్ధన్‌లను నిందితులుగా చేర్చారు పోలీసులు. పోలీసుల అదుపులో ఐదుగురు అనుమానితులు ఉన్నారు. కీలక నిందితుడు ఎంపీటీసీ బజారయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

ఇవాళ గంజి ప్రసాద్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో జి.కొత్తపల్లిలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150మంది పోలీసులు మోహరించారు. కాసేపట్లో హోంమంత్రి తానేటి వనిత గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అండదండలతోనే హత్య జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ‌తన తండ్రి హత్యకు ఏడాదికాలంగా రెక్కీ నిర్వహించారని ఆరోపించారు గంజి ప్రసాద్ తనయుడు ఫణికుమార్‌. పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అండతోనే హత్య జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశాడు ఫణికుమార్‌. కేసు నీరు గారిపోతుందనే ఉద్దేశ్యంతోనే ఫిర్యాదులో ఎమ్మెల్యే పేరు చేర్చలేదని అంటున్నారు. ఏడాది నుంచి మా నాన్న హత్యకు ప్లాన్‌ చేశారని..దీనిపై ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నాడు. ఇప్పటికైనా ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

ఇదిలావుంటే, గంజి ప్రసాద్ హత్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.గంజి ప్రసాద్ హత్య వెనుక ఎమ్మెల్యే వెంకట్రావ్ హస్తం ఉందని ఆరోపించారు. ద్వారక తిరుమలలోని ఓ భూమి కాజేసేందుకు బినామీని సృష్టించాడని, దానిని రెవెన్యూ రికార్డ్‌లో ఎక్కించి పంచాయితీ తీర్మానం చేశారన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఎక్కడ తన పేరు బయటకొస్తుందనే గంజి ప్రసాద్‌ను ఎమ్మెల్యే హత్య చేయించారని పితాని సత్యనారాయణ ఆరోపించారు. వైసీపీ నేతలే ఎమ్మెల్యేపై దాడి చేస్తే.. టీడీపీ వాళ్లని బుకాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి గంజి ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు.

Read Also….  Sri Lanka Crisis: తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రతిపక్షాలు..!