AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనాభా లెక్కలంటూ నానమ్మకు బురిడీ..11నెలల చిన్నారి కిడ్నాప్

జయశంకర్‌ భూపాలపల్లి సింగంపల్లిలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపింది. జనాభా లెక్కల కోసం వచ్చామని చెప్పి..

జనాభా లెక్కలంటూ నానమ్మకు బురిడీ..11నెలల చిన్నారి కిడ్నాప్
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2020 | 11:52 AM

Share

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడాదిలోపు ఉన్న బాబును ఎత్తుకెళ్లారు. ఇంటి ముందు నానమ్మతో పాటు ఆడుకుంటున్న బాలుడి మిస్సింగ్ ఘటనతో ఒక్కసారిగా స్థానికులతో పాటుగా జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు.  వివరాల్లోకి వెళితే… జయశంకర్‌ భూపాలపల్లిలో ఈ కిడ్నాప్ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సింగంపల్లిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ ముసలమ్మ చిన్నారిని ఆడిపిస్తుండగా అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను పలకరించారు. జనాభా లెక్కల కోసం వచ్చామని, మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలంటే.. రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపించాలని అడిగారు. దీంతో ఆమె బాలుడిన్ని అక్కడే వదిలి..ఆధారాలు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది బాలుడి నానమ్మ. తిరిగి వచ్చి చూసేసరికి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు…బాలుడు కూడా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కలంతా గాలించారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా ఫిర్యాదులో పోలీసులకు వెల్లడించారు. కిడ్నాపైన చిన్నారి వయస్సు 11 నెలలు ఉంటుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు హరీష్‌ ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా పోలీసుల గాలిస్తున్నారు.

Follow Us
జెన్‌జీస్ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మారుతున్న ఆ దేశం! ఎందుకంటే?
జెన్‌జీస్ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మారుతున్న ఆ దేశం! ఎందుకంటే?
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్ ఇదే..
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్ ఇదే..
గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??
గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??
తొక్కే కదా అని తీసిపారేయకండి.. అవి చేసే మ్యాజిక్ తెలిస్తే..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. అవి చేసే మ్యాజిక్ తెలిస్తే..
పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌..
పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌..
తెలియని పెళ్లిలో భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష..
తెలియని పెళ్లిలో భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష..
ఎండకి జుట్టు రాలిపోతోందా?.. ఒత్తుగా పెరగాలంటే ఇదిగో మార్గం!
ఎండకి జుట్టు రాలిపోతోందా?.. ఒత్తుగా పెరగాలంటే ఇదిగో మార్గం!
ఉగాది పచ్చడి కంటే ముందే మామిడి పళ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఉగాది పచ్చడి కంటే ముందే మామిడి పళ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
ఆరోగ్యానికి ఈ తెల్లటి గింజలు చేసే మ్యాజిక్.. ఆ రోగాలపై రామబాణం
ఆరోగ్యానికి ఈ తెల్లటి గింజలు చేసే మ్యాజిక్.. ఆ రోగాలపై రామబాణం
వేసవిలో మీ ఫ్యాన్ వేడి గాలిని ఇస్తోందా?.. ఇంటిని చల్లబరిచే టిప్స్
వేసవిలో మీ ఫ్యాన్ వేడి గాలిని ఇస్తోందా?.. ఇంటిని చల్లబరిచే టిప్స్