మా కూతురు ప్రెగ్నెంట్ కాదు.. తనపై అత్యాచారం జరగలేదు!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మానేజర్ దిశ సలియాన్ జూన్ నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దిశ ఆత్మహత్య చేసుకున్న వారం రోజులలోపే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవటంతో.. ఇద్దరి మరణాలకు ఏమైనా సంబంధం ఉందా?
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మానేజర్ దిశ సలియాన్ జూన్ నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దిశ ఆత్మహత్య చేసుకున్న వారం రోజులలోపే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవటంతో.. ఇద్దరి మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు అధికారులు. ఈ క్రమంలో దిశపై సూసైడ్‌కు ముందు అత్యాచారం జరిగిందని, ఆమె గర్భవతి అని పలు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఆమె ప్రైవేటు భాగాల్లో గాయాలు కూడా ఉన్నాయని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తమ కూతురుపై అసత్య ప్రచారాలు చేయవద్దని దిశ సలియాన్ తల్లిదండ్రులు మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. దిశపై అత్యాచారం జరిగిందన్న వార్తలను కూడా వారు ఖండించారు. మా కూతురు గర్భవతి కాదు. ఇంతకు ముందు కూడా ఆమె గర్భం దాల్చలేదు. తనపై ఎన్నడూ ఎలాంటి అత్యాచారం కూడా జరగలేదు. తన అవయవాలకు సంబంధించిన అన్ని రిపోర్టులు స్పష్టంగా ఉన్నాయి. ముంబై పోలీసులు మాకు అన్ని పూర్తిగా వివరించారు. వారిపై మాకు నమ్మకం ఉంది. అలాగే దయచేసి దిశకు చెడ్డ పేరు తెచ్చేలా రూమర్లు ప్రచారం చేయకండి. తన గురించి ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. తమ కూతురి గురించి తప్పుగా మాట్లాడవద్దని, నిజానిజాలేమిటో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు దిశ సలియాన్ తల్లిదండ్రులు.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య