Terror attack plans: దేశవ్యాప్తంగా భారీ కుట్రకు ఉగ్ర ముఠా ప్లాన్.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 16, 2021 | 7:32 PM

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే పండగల సీజన్‌లో భీకర దాడులకు పాల్పడేందుకు వీరు కుట్రలు చేశారు.

Terror attack plans: దేశవ్యాప్తంగా భారీ కుట్రకు ఉగ్ర ముఠా ప్లాన్.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
Delhi Terror Module

Follow us on

Delhi Terror Module: ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే పండగల సీజన్‌లో భీకర దాడులకు పాల్పడేందుకు వీరు కుట్రలు చేశారు. కాగా.. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహా దాడులకు ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి.

దేశంలో భారీ కుట్రలకు ఉగ్రవాదులు ప్లాన్‌లు చేస్తున్నట్లు బట్టబయలైంది. బ్రిడ్జిలు, రైల్వే లైన్లు పేల్చేందుకు భారీగా కుట్రలు చేసినట్టు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారణలో వెల్లడైంది. ఉగ్రవాదుల వద్ద 1.5 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. వీరిలో ఇద్దరు జీషాన్, ఒసామా పాకిస్తాన్‌లో శిక్షణ పొందినట్టు గుర్తించారు. గ్వాదర్ పోర్టు ద్వారా పాక్‌లోకి ప్రవేశించి శిక్షణ తీసుకున్నట్టు జీషాన్.. పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రముఠాను దర్యాప్తు చేస్తున్న కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహా పెద్ద ఎత్తు దాడులకు ముష్కరులు ప్లాన్‌ చేసినట్లు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు చెప్పాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఒమన్ నుంచి మోటార్‌ బోట్ ద్వారా సముద్రంలో ప్రయాణించారు. మరో 15 మంది బెంగాలీ మాట్లాడే ఉగ్రవాదులకు కూడా అక్కడ శిక్షణనిచ్చినట్టు విచారణలో వెల్లడైంది. పాక్ శిక్షణ పొందినవారి వద్ద మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థం ఆర్డీఎక్స్ లభ్యమైంది. బ్రిడ్జిలు, రైల్వే లైన్ల పేల్చివేతతో పాటు రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు విచారణలో వెల్లడించారు. ఆర్డీఎక్స్‌తో 1993 ముంబై పేలుళ్ల తరహాలో భారీ విధ్వంసాలకు పథక రచన చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని స్లీపర్ సెల్స్ ఈ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు గుర్తించారు.త్వరలో మరిన్ని అరెస్టులకు ఆస్కారం ఉందని స్పెషల్‌ సెల్‌ పోలీసులు చెబుతున్నారు

నిఘా సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో గత మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో అనూహ్య దాడులు నిర్వహించిన ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు.. ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురిని, ఢిల్లీలో ఇద్దరిని, రాజస్థాన్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారిని జాన్‌ మొహమూద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్‌, ఒసామా, మూల్‌చాంద్‌, జీషన్‌ ఖమార్‌, మొహమూద్‌ అబు బకర్‌, మహమ్మద్‌ ఆమిర్‌ జావేద్‌లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా వీరిని అనేక కోణాల్లో ప్రశ్నించగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. ఆ పేలుళ్ల తరహాలో.. ఈ ఉగ్రవాదులకు రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జ్‌లు పేల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసిందని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో రెక్కీ అనంతరం వీరంతా ఒక చోట చేరి ఆపరేషన్‌ చేపట్టాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సమూహాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.పాక్​కు వెళ్లి వచ్చారని నిఘా వర్గాలు వెల్లడించాయి.

కొందరు స్లీపర్ సెల్స్‌ పేర్లను ముష్కరులు చెప్పినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వర్గాలు పేర్కొన్నాయి. వారి కోసం గాలిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలిపాయి. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి 1.5కిలోల ఆర్డీఎక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.1993 మార్చి 12న దేశ వాణిజ్య రాజధాని ముంబయి వ్యాప్తంగా 12 వరుస బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. స్మగ్లింగ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహిం నేతృత్వంలో జరిగిన ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణశిక్ష పడిన ప్రధాన పాత్రదారు యాకుబ్‌ మేనన్‌ను 2015లో ఉరితీశారు.

Read Also…  North Korea Missiles: రైలు నుంచి క్షిపణి పరీక్ష.. ప్రపంచవ్యాప్తంగా హీట్ పెంచిన ఉత్తరకొరియా.. భద్రతా మండలి ఆందోళన!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu