అత్తింటి వారిపై కోపం..చేపల కూరలో స్లో పాయిజన్.. అత్తా, మరదలు మృతి.. అసలు విషయం ఏంటంటే..?
ఢిల్లీలో ఓ వ్యక్తి అత్తింటి వారిపై పగ పెంచుకున్నాడు. భార్యతో పాటు అత్తామామలు, మరదలిని చంపేందుకు చేపల కూర వండి, వారికి తినిపించాడు.
Delhi Crime News: ఢిల్లీలో ఓ వ్యక్తి అత్తింటి వారిపై పగ పెంచుకున్నాడు. భార్యతో పాటు అత్తామామలు, మరదలిని చంపేందుకు చేపల కూర వండి, వారికి తినిపించాడు. అందులో థాలియం అనే రసాయనం కలపడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అత్త, మరదలు చనిపోగా భార్య, మామ చికిత్స పొందుతున్నారు.
వరుణ్ అరోరాకి కొన్నేళ్ల క్రితం దివ్య అనే మహిళతో వివాహమైంది. అయితే, పెళ్లైన నాటి నుంచి తనను సరిగా పట్టించుకోవడంలేదనే అక్కసుతో వరుణ్ అత్తింటివాళ్లపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో చేపల కూర వండి, అందులో థాలియం కలిపాడు. వారింటికి వెళ్లి అందరికీ కూర వడ్డించి తినాల్సిందిగా కోరాడు. కాగా స్లో పాయిజన్‌లా పనిచేసే థాలియం దుష్ప్రభావం అప్పటికపుడు తెలియలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఆరోగ్యంలో మార్పులు వొచ్చాయి. జుట్టు ఊడటం, కాళ్లలో మంటలు పుట్టడం మొదలయ్యాయి .
అత్త, మరదలి హఠాన్మరణాల నేపథ్యంలో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తానే చేపల కూరలో థాలియం కలిపానని, స్లో పాయిజన్ ద్వారా వారిని చంపడమే తన ఉద్దేశమని వరుణ్ అసలు విషయం బయటపెట్టాడు. ప్రత్యర్థులను థాలియంతో మట్టుబెట్టే ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను స్పూర్తిగా తీసుకున్నట్లు తెలిపాడు. ఈ పరిణామం స్థానికుల్ని షాక్‌కి గురి చేసింది.
Also Read: 13 ఏళ్ల వయస్సులోనే గర్భవతి అయ్యి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం.. ఇప్పుడు ఆమె సంపాదన షాకింగ్..
భలే..భలే..ఈ చెట్టు మనిషి ముట్టుకోగానే నవ్వుతుంది.. ఇంతకంటే విచిత్రం ఉంటుందా..?